ప్రారంభమైన అతిరుద్ర మహాయజ్ఞం
ప్రశాంతి నిలయం: సత్యసాయి బాబా శతజయంతిని పురస్కరించుకుని విశ్వశాంతిని కాంక్షిస్తూ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ శుక్రవారం అతిరుద్ర మహాయజ్ఞం ప్రారంభించింది. చైన్నెకి చెందిన శ్రీనివాస్ శర్మ నేతృత్వంలో 180 మంది రుత్వికుల ఆధ్వర్యంలో ప్రశాంతి నిలయంలోని సాయికుల్వంత్ సభా మందిరంలో ఈ మహాయజ్ఞాన్ని నిర్వహిస్తున్నారు. ఈ నెల 14 నుంచి 25వ తేదీ వరకు యజ్ఞం కొనసాగనుంది. శుక్రవారం ఉదయం 6 గంటలకు గణపతి పూజతో అతిరుద్ర మహాయజ్ఞం ప్రారంభమైంది. అనంతరం అర్చకులు పలు పూజలు నిర్వహించారు. సాయంత్రం అతిరుద్ర మహా యజ్ఞం ప్రాధాన్యత, ఫలితాలను ఉద్దేశించి ప్రధాన అర్చకుడు శ్రీనివాస శర్మ వివరించారు. అనంతరం కలశ స్థాపన, మహన్యాస పారాయణం, ఏకాదళ రుద్ర అవాహనం, షోడశ ఉపచార పూజ, కర్మార్చనం, అష్టావధాన సేవ నిర్వహించారు. సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్‌జే రత్నాకర్ రాజు దంపతులు యజ్ఞ క్రతువులో పాల్గొన్నారు. సత్యసాయి భక్తులు వేలాదిగా పాల్గొన్నారు.
ప్రారంభమైన అతిరుద్ర మహాయజ్ఞం
ప్రారంభమైన అతిరుద్ర మహాయజ్ఞం
Comments
Please login to add a commentAdd a comment