
స్వచ్ఛ మార్గంలో పయనిద్దాం
● కలెక్టర్ టీఎస్ చేతన్
ప్రశాంతి నిలయం: రాష్ట్ర ప్రభుత్వం స్వర్ణాంధ్ర –స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోందని, ప్రభుత్వ అశయాల మేరకు ప్రతి ఒక్కరూ స్వచ్ఛతా మార్గంలో పయనిద్దామని కలెక్టర్ టీఎస్ చేతన్ పిలుపునిచ్చారు. మూడో శనివారం నిర్వహించాల్సిన స్వచ్ఛాంధ్ర కార్యక్రమంపై జిల్లా స్థాయి అధికారులు, ఆర్డీఓలు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలతో గురువారం కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి నెలా క్రమం తప్పకుండా స్వచ్ఛతా కార్యక్రమాలు చేపట్టాలన్నారు. గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో స్వచ్ఛ దివస్ కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ఆస్పత్రులు, పారిశ్రామిక యూనిట్లు, పాఠశాలలు, కాలేజీలు, బస్టాండ్లు, మార్కెట్ యార్డులు, ప్రభుత్వ కార్యాలయాల్లో స్వచ్ఛతా పరిమళాలు వెల్లివిరియాలన్నారు. అయా శాఖల ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమాల వివరాలను స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర యాప్‌లో తప్పనిసరిగా అప్లోడ్ చేయాలన్నారు. డీపీఓ సమత, డీఆర్‌డీఏ పీడీ నరసయ్య, గ్రామ వార్డు సచివాలయ నోడల్ అధికారి సుధాకర్‌రెడ్డి, జెడ్పీ డిప్యూటీ సీఈవో వెంకటసుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు.
పరిశ్రమల యాజమాన్యాలు
భాగస్వాములు కావాలి
స్వర్ణాంధ్ర సాధనలో పరిశ్రమల యాజమాన్యాలు భాగస్వాములు కావాలని కలెక్టర్ టీఎస్ చేతన్ కోరారు. గురువారం కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ సమావేశ మందిరంలో సీఎస్‌ఆర్ నిధుల వినియోగంపై వివిధ పరిశ్రమల యాజమాన్యాలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో సీఎస్‌ఆర్ నిధుల వినియోగంపై ప్రణాళికా బద్ధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందే పనులకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. సీపీఓ విజయ్‌కుమార్, పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ నాగరాజు, డీపీఓ సమత, పలు కంపెనీలు ప్రతినిధులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment