కదిరి: నవ నారసింహ క్షేత్రాల్లో ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం కూడా ఒకటి. ఇక్కడ స్వామివారు నిత్య పూజలతో వెలుగొందుతున్నారు. అయితే తన ప్రియభక్తుడు ప్రహ్లాదుడితో కలసి ఉన్న నరసింహస్వామి దర్శనం కదిరిలో తప్ప దేశంలో మరెక్కడా లేదు. నారసింహుడికి ఎడమ వైపు ప్రహ్లాదుడు నిల్చొని ఉండడం ఇక్కడ చూడవచ్చు. ‘భక్త ప్రహ్లాద సమేత నారసింహుడి దర్శనం..పాప విమోచనం’ అని ఇక్కడి అర్చక పండితులు చెబుతున్నారు. సైన్స్‌కు కూడా అంతుచిక్కని దైవ రహస్యం మరొకటి ఇక్కడ గమనించవచ్చు. ఇక్కడి మూలవిరాట్‌కు ప్రతి నెలా స్వాతి నక్షత్రం రోజు మాత్రమే అభిషేకం చేస్తారు. అభిషేకం చేసిన అనంతరం మూలవిరాట్ నుంచి స్వేద బిందువులు బయటకు వస్తుంటాయి. వస్త్రంతో ఆ స్వేదాన్ని తుడిచినా మళ్లీ వస్తూ ఉంటుంది. స్వామివారు ఇక్కడ నిజరూపంలో ఉన్నారని చెప్పడానికే ఇలా స్వేద బిందువులు వస్తుంటాయని భక్తుల నమ్మకం.
ప్రహ్లాద సమేత నారసింహుడు ఇక్కడే...