ప్రశాంతంగా ‘పది’ పరీక్షలు
పుట్టపర్తి/ పుట్టపర్తి టౌన్: పదో తరగతి పరీక్షలు జిల్లాలో తొలిరోజు సోమవారం ప్రశాంతంగా జరిగాయని జిల్లా విద్యాశాఖాధికారి కృష్ణప్ప తెలిపారు. ధర్మవరం, పెనుకొండ డివిజన్ల పరిధిలో 104 కేంద్రాలు ఏర్పాటు చేయగా, ఫస్ట్ లాంగ్వేజ్ పరీక్షకు 210 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని వెల్లడించారు. 21393 మంది విద్యార్థులకు గాను, 21,183 మంది హాజరయ్యారని వెల్లడించారు.
కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ
పదో తరగతి పరీక్ష కేంద్రాలను సోమవారం కలెక్టర్ చేతన్, ఎస్పీ రత్న పరిశీలించారు. పుట్టపర్తి మన్సిపాలిటీ పరిధిలోని ఎనుములపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కేంద్రాన్ని వారు వేర్వేరుగా సందర్శించారు. ఈ సందర్భంగా పరీక్షా కేంద్రంలో విద్యార్థులకు కల్పించిన తాగునీరు, ఫర్నీచర్, విద్యుత్ సౌకర్యం, ఫ్యాన్లు తదితర మౌలిక సదుపాయలపై ఆరా తీశారు. పరీక్షా కేంద్రం ఆవరణలో ఏర్పాటు చేసిన వైద్యశిబిరాన్నీ పరిశీలించారు. అనారోగ్యంతో బాధపడుతున్న విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. వారికి మరిన్ని మెరుగైన సౌకర్యాలు కల్పించాలని కలెక్టర్ సూచించారు. ఎస్పీ మాట్లాడుతూ... విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందని, కేంద్రాల్లోకి ఇతరులను అనుమతించకూడదన్నారు.
పుట్టపర్తిలో పరీక్ష కేంద్రాన్ని
తనిఖీ చేసిన కలెక్టర్ చేతన్
Comments
Please login to add a commentAdd a comment