వ్యభిచారం కేసులో కానిస్టేబుల్ అరెస్ట్
హిందూపురం అర్బన్: అడ్డదారులు తొక్కి సులువుగా డబ్బు సంపాదించాలన్న ఓ కానిస్టేబుల్ ఏకంగా వ్యభిచారం నిర్వహిస్తూ పోలీసులకు పట్టుబడి కటకటాల పాలయ్యాడు. ఈ ఘటన హిందూపురంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. కానిస్టేబుల్ పురుషోత్తం హిందూపురం రెండో పట్టణ పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తూ ఇటీవలే మడకశిర స్టేషన్‌కు బదిలీ అయ్యాడు. హిందూపురంలోని మోడల్ కాలనీలో ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నాడు. పట్టణంలోని బోయ పేటకు చెందిన ఓ మహిళతో కలిసి ఆ ఇంట్లో వ్యభిచార కేంద్రాన్ని ప్రారంభించాడు. ఇతర ప్రాంతాల నుంచి అమ్మాయిలను తీసుకు వచ్చేవారు. కానిస్టేబుల్ వ్యవహారశైలిని గమనించిన చుట్టుపక్కల ఇళ్ల వారు పలుమార్లు హెచ్చరించారు. అయినా పద్ధతి మార్చుకోకపోవడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. రెండో పట్టణ సీఐ అబ్దుల్ కరీం, సిబ్బంది ఈ నెల 18న రాత్రి ఆ ఇంటిపై దాడి చేసి కానిస్టేబుల్‌తో పాటు సదరు మహిళను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో వ్యభిచారం నిర్వహిస్తున్న విషయం వెలుగు చూడటంతో శుక్రవారం ఇద్దరిపై కేసు నమోదు చేసి..రిమాండుకు తరలించారు. ఇదే కేసులో మేళాపురానికి చెందిన ఈశ్వర్ అనే వ్యక్తి పరారీలో ఉన్నట్లు సీఐ తెలిపారు. కాగా.. కానిస్టేబుల్ పురుషోత్తం గుడిబండ స్టేషన్‌లో పనిచేసిన సమయంలోనూ పలు ఆరోపణలతో సస్పెండ్ అయ్యాడు.
మరో ఇద్దరు అరెస్టు..
● హిందూపురం పట్టణంలోని సీపీఐ కాలనీలో ఎస్.బాబా, అతని భార్య వ్యభిచారం నిర్వహిస్తుండగా శుక్రవారం ఉదయం దాడి చేసి వారితో పాటు మరొక మహిళను అరెస్టు చేసినట్లు సీఐ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment