హిందూపురం అర్బన్: హిందూపురం మార్కెట్‌లో చింత పండు ధరలు తగ్గుముఖం పట్టాయి. గత రెండు వారాలతో పోలిస్తే క్వింటాపై రూ.6,000 తగ్గుదల కనిపించింది. గురువారం మార్కెట్‌కు 1,700 క్వింటాళ్ల చింత పండు రాగా ఈ నామ్ పద్ధతిలో మార్కెట్‌లో వేలం పాట నిర్వహించారు. కరిపులి రకం గత రెండు వారాల క్రితం గరిష్టంగా క్వింటా రూ.33 000 పలుకగా ఈవారం 27,000 పలికింది. కనిష్టం రూ. 8,100గా పలికింది. సగటున రూ.13,500 పలికింది. ఇక.. ప్లవర్ రకం క్వింటా గరిష్ట ధర రూ. 12,500 పలుకగా కనిష్ట ధర రూ.4,500 పలికింది. సగటు ధర రూ.7,500 పలికినట్లు మార్కెట్ కార్యదర్శి జి. చంద్రమౌళి తెలిపారు. గత వారం అక్కడక్కడా వడగండ్ల వర్షం కురవడం, వాతావరణ మార్పులు ధరలపై ప్రభావం చూపాయన్నారు.