కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చిన పండ్ల తోటలు ఎండుతున్నాయి. వర్షాభావ పరిస్థితులు రైతుల ఆశలను చిదిమేశాయి. భూగర్భజలాలు అడుగంటుతున్నాయి. వ్యవసాయబోర్లు ఒట్టిపోతున్నాయి. పంటలను రక్షించుకునేందుకు కొత్తగా బోర్లు వేద్దామనుకుంటే నిరాశే ఎదురవుతోంది. వెయ్యి అడుగుల ద | - | Sakshi
Sakshi News home page

కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చిన పండ్ల తోటలు ఎండుతున్నాయి. వర్షాభావ పరిస్థితులు రైతుల ఆశలను చిదిమేశాయి. భూగర్భజలాలు అడుగంటుతున్నాయి. వ్యవసాయబోర్లు ఒట్టిపోతున్నాయి. పంటలను రక్షించుకునేందుకు కొత్తగా బోర్లు వేద్దామనుకుంటే నిరాశే ఎదురవుతోంది. వెయ్యి అడుగుల ద

Published Tue, Apr 1 2025 9:51 AM | Last Updated on Tue, Apr 1 2025 2:15 PM

కునుకుంట్ల వద్ద సాగునీరు చాలక వాడుపట్టిన చీనీ తోట

తాడిమర్రి: ధర్మవరం నియోజకవర్గంలోని తాడిమర్రి మండలంలో ఉద్యాన పంటలు విరివిగా సాగవుతున్నాయి. ఇక్కడి ఎర్రనేలల్లో పండే చీనీ, అరటి, మామిడి, దానిమ్మ తదితర పంటలు నాణ్యతతో పాటు రుచికరంగా ఉంటుండటంతో వ్యాపారులే తోటల వద్దకు వచ్చి కొంటుంటారు. గత కొన్నేళ్లుగా కునుకుంట్ల, రామాపురం, శివంపల్లి, చిల్లకొండయ్యపల్లి, తాడిమర్రి, మోదుగులకుంట, ముద్దులచెరువు, పుల్లానారాయణపల్లి గ్రామాల్లో చీనీ, దాడితోట, చిల్లవారిపల్లి, నాయనిపల్లి, తురకవారిపల్లి, ఏకపాదంపల్లి తదితర గ్రామాల్లో అరటి సాగు చేస్తున్నారు. వ్యవసాయబోర్ల ద్వారా నీటిని అందిస్తూ మేలైన దిగుబడులు సాధిస్తూ వస్తున్నారు. గత ఏడాది వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో భూగర్భజలాలు అమాంతం పడిపోయాయి. బోర్లల్లో నీరు తగ్గిపోవడంతో తోటలు ఎండుముఖం పట్టాయి. 20 ఏళ్లపాటు ఫలసాయం అందిస్తున్న తోటలను కాపాడుకోవడానికి రైతులు కొత్తగా బోర్లు వేస్తున్నారు. ఒక దాని తర్వాత మరొకటి వేసుకుంటూ పోతున్నారు. రైతుల శక్తి మేరకు 800 నుంచి 1000 అడుగుల వరకు తవ్వించినా నీరు పడటం లేదు. బోర్ల తవ్వకం కోసం చేసిన అప్పులు ఒక వైపు.. ఎండిపోతున్న పంటలు మరోవైపు రైతులను మనోవేదనకు గురిచేస్తున్నాయి.

పంట కోత.. గుండె కోత..

వ్యవసాయ బోర్లు వట్టి పోతుండటంలో మిశ్రమ పంటలు వేసిన రైతుల పరిస్థితి మరీ దయనీయంగా మారింది. ఒక పంటకు నీరందించాలంటే మిగిలిన పంటలను ఎండబెట్టాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. కునుకుంట్లలో ఓ రైతు తనకున్న ఐదెకరాల్లో చీనీ, 4 ఎకరాల్లో అరటి, రెండెకరాల్లో కళింగర సాగుచేశాడు. ఉన్నట్టుండి రెండు బోర్లల్లో నీటిమట్టం తగ్గిపోయింది. దీంతో ఆ రైతు చీనీ చెట్లను కాపాడుకునేందుకు మిగిలిన రెండు పంటలను వదిలేశాడు.

● మరో రైతు రెండెకరాల్లో చీనీ, రెండెకరాల్లో అరటి సాగు చేశాడు. రెండు బోర్ల ద్వారా పంటలకు నీరందించేవాడు. అయితే కొంతకాలంగా బోర్లలో నీరు తగ్గడంతో రెండు పంటలకు చాలడం లేదు. దీంతో ఆ రైతు చీనీ పంటను కాపాడుకోవడానికి అరటికి నీరు పెట్టడం మానేశాడు. ఇలా ఈ ఇద్దరే కాదు వందలాది మంది రైతులు చీనీ, అరటితో పాటు అంతర పంటలుగా టమాట, దోస, కళింగర, మిరప సాగు చేశారు. భూగర్భజలాలు అడుగంటిన తరుణంలో చీనీ కోసం ఇతర పంటలకు నీటి తడులు ఇవ్వలేకపోతున్నారు. మరికొందరు రైతులు ట్యాంకరు నీటికి రూ.700 చొప్పున చెల్లించి పంటలను కాపాడుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. 5 ఎకరాలు ఉన్న రైతు రోజుకు రూ.4,200 ఖర్చు చేసి ఆరు ట్యాంకర్లతో నీరు తోలిస్తున్నారు.

భూగర్భజలాలు పడిపోయాయిలా..

తాడిమర్రి మండలంలో భూగర్భజలాలు దారుణంగా పడిపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. గత ఏడాది జూన్‌ నుంచి మార్చి వరకు 431.5 మి.మీ. సాధారణ వర్షానికి గాను 518 మి.మీ కురిసింది. అయితే ఒకే విడతలో వర్షం కుమ్మేసింది. ఆ తర్వాత వరుణుడు ముఖం చాటేశాడు. ఫలితంగా భూగర్భజలాలు ఎక్కువ కాలం నిల్వ ఉండలేక పోయాయి. దీంతో బోరుబావుల్లో నీరు అడుగంటి పంటలకు పూర్తిస్థాయిలో చేరని పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో పంటలు కాపాడుకోవడం రైతులకు కష్టతరమైంది.

తాడిమర్రి మండలంలో

పండ్ల తోటల వివరాలు (ఎకరాల్లో)

వర్షాభావంతో అడుగంటుతున్న

భూగర్భజలాలు

వెయ్యి అడుగులు తవ్వినా

కనిపించని నీటిజాడ

ఎండుతున్న చీనీ, మామిడి,

అరటి తోటలు

పంటలు కాపాడుకునేందుకు

రైతుల అగచాట్లు

ఎడాపెడా బోర్లు వేయొద్దు

పంటను కాపాడుకోవాలనే తాపత్రయంతో రైతులు ఎడాపెడా బోర్లు తవ్వించరాదు. ప్రభుత్వ జియాలజిస్ట్‌ల ద్వారా పాయింట్లను ఏర్పాటు చేసి బోర్లు వేయించుకోవాలి. అలాగే చీనీ చెట్లను మరికొంత కాలం కాపాడుకునేందుకు చెట్లకు ఉన్న కాయలను వెంటనే తొలగించాలి. అలాగే నీటిలో యూరియాను కలిపి పిచికారీ చేస్తే మరింత కాలం కాపాడుకోవచ్చు.

– అమరేశ్వరి, ఉద్యాన అధికారి, ధర్మవరం

500

8,580

500

100

కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చిన పండ్ల తోటలు ఎండుతున్న1
1/3

కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చిన పండ్ల తోటలు ఎండుతున్న

కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చిన పండ్ల తోటలు ఎండుతున్న2
2/3

కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చిన పండ్ల తోటలు ఎండుతున్న

కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చిన పండ్ల తోటలు ఎండుతున్న3
3/3

కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చిన పండ్ల తోటలు ఎండుతున్న

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement