
రైతులకు ఉపయోగపడేలా శిక్షణ
ఆమదాలవలస: రైతులకు ఉపయోగపడేలా యువతకు వృత్తి నైపుణ్యంలో శిక్షణ తరగతులు నిర్వహించాలని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ఎక్స్టెన్షన్ డాక్టర్ బి.ముకుంద రావు సూచించారు. ఆమదాలవలసలోని కృషివిజ్ఞాన కేంద్రంలో బుధవారం కె.వి.కె. ప్రోగ్రాం కో ఆర్డినేటర్ డాక్టర్ భాగ్యలక్ష్మి ఆధ్వర్యంలో అనకాపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం అసోసియేట్ డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ డాక్టర్ సీహెచ్ ముకుందరావు అధ్యక్షతన 43వ శాసీ్త్రయ సలహా మండలి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2025– 26 సంవత్సరంలో చేయాల్సిన పరిశీలన క్షేత్రాలు, ప్రదర్శన క్షేత్రాలపై దిశా నిర్దేశం చేశారు. నైరా వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ ఎం.భరత లక్ష్మి, కె.వి.కె. సమన్వయకర్త డాక్టర్ కె.భాగ్యలక్ష్మి, జిల్లా వ్యవసాయాధికారి త్రినాథస్వామి, జిల్లా మత్స్య అధికారి డాక్టర్ పి.శ్రీనివాస్, ఏపీ ఎంఐపీ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీనివాస్, యానిమల్ హస్బండ్రీ అసిస్టెంట్ డైరెక్టర్ ఆనంద్‌రావు, నాబార్డ్ జిల్లా అభివృద్ధి అధికారి కె.రమేష్ కృష్ణ, నైరా వ్యవసాయ కళాశాల ప్రొఫెసర్ అండ్ హెడ్ విస్తరణశాఖ డాక్టర్ డి.చిన్నంనాయుడు, కీటక శాస్త్రం విభాగాధిపతి డాక్టర్ పి.సీతారాం, రాగోలు వ్యవసాయ పరిశోధన స్థానం అధిపతి డాక్టర్ పి.ఉదయ బాబు, ఆమదాలవలస వ్యవసాయ పరిశోధనా స్థానం అధిపతి డాక్టర్ జి.చిట్టిబాబు, అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ భవానీశంకర్, రెడ్డి ఫౌండేషన్ మేనేజర్ హరిబాబు వివిధ అంశాలపై ప్రంసగించారు. రైతులకు అందించాల్సిన శిక్షణలు, పరిశోధనలు, దిగుబడులు, చీడ పీడ నివారణపై చర్చించారు.
Comments
Please login to add a commentAdd a comment