ట్రాక్టర్ నుంచి జారిపడి డ్రైవర్ మృతి
టెక్కలి రూరల్ : ట్రాక్టర్ నడుపుతున్న డ్రైవర్ ప్రమాదవశాత్తు జారిపడటంతో దుర్మరణం చెందిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మెళియాపుట్టి మండలం బంజీరు గ్రామానికి చెందిన గూడ మార్కండరావు(33) టెక్కలి జూనియర్ కళాశాల మైదానంలోనిల సివిల్‌సప్లయ్ ఎంఎల్‌ఎస్ గొడౌన్‌లో బియ్యం రవాణా చేసే ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఆదివారం ట్రాక్టర్‌లో బియ్యం లోడు వేసుకుని నందిగాం మండలంలో అన్‌లోడ్ చేశాడు. తిరిగివస్తుండగా టెక్కలి సమీప పాత రవి దాబా వద్ద అప్రోచ్ రోడ్డులోకి తిరుగుతున్న సమయంలో ఉమ్మి ఊస్తుండగా ప్రమాదవశాత్తు జారిపడ్డాడు. తీవ్ర గాయాలు కావడంతో టెక్కలి జిల్లా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందాడు. మార్కండరావుకు భార్య, పిల్లలు ఉన్నారు. టెక్కలి పోలీసులు వివరాలు సేకరించి కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment