No Headline
●
అందరూ వాయిదా కోరారు
అభ్యర్థుల్లో ఎక్కువ మంది పరీక్ష వాయిదా వేయాలని కోరారు. రోస్టర్ లోపాలు సరిచేసి, ఖాళీలకు అనుగుణంగా పోస్టులు పెంచి పరీక్షలు నిర్వహించాల్సింది. అభ్యర్థుల సమస్యను పట్టించుకోవాల్సిన అవసరం ప్రభుత్వంపై ఉంది. – సిద్ధూ, అభ్యర్థి
ఎన్నో ఏళ్ల శ్రమ.. అనేక ఏళ్ల కల. సరిగ్గా కీలకమైన పరీక్ష రాసే సమయానికి సర్కారు పుణ్యమా అని అభ్యర్థులు అయోమయ పరిస్థితిని ఎదుర్కొన్నారు. ప్రశాంత వాతావరణంలో పరీక్ష రాయాల్సింది పోయి హడావుడిగా.. కంగారు కంగారుగా పరీక్ష రాశారు. చాలా మంది అభ్యర్థులు పరీక్ష వాయిదా వేస్తారేమోనని చివరి నిమిషం వరకు ఎదురు చూశారు. కట్టుదిట్టంగా ఖాళీల పర్యవేక్షణ నడుమ పరీక్ష సజావుగా జరిగినా.. అభ్యర్థులు మాత్రం ఆవేదనతోనే హాజరయ్యారు. మొత్తానికి గ్రూప్–2 అభ్యర్థులకు విషమ పరీక్ష పెట్టింది.
శ్రీకాకుళం న్యూకాలనీ, ఎచ్చెర్ల క్యాంపస్, శ్రీకాకుళం పీఎన్ కాలనీ, శ్రీకాకుళం రూరల్:
జిల్లాలో ఆదివారం జరిగిన గ్రూప్–2 మెయి న్స్ పరీక్ష పోలీసుల కాపలా నడుమ సాగింది. రోస్టర్ విధానంలో సవరింపులు చేసి పరీక్షను నిర్వహించాలని రాష్ట్రవ్యాప్తంగా శనివారం అర్ధరాత్రి వర కు అభ్యర్థులు ఆందోళన చేసిన విషయం తెలిసిందే. శ్రీకాకుళంలో సైతం అభ్యర్థులు సామాజిక మాధ్యమాల్లో తమ ఆవేదనను వ్యక్తం చేశారు. ప్రభుత్వం పరీక్షను వాయిదా వేస్తుందేమోనని ఆఖరి నిమిషం వరకు ఎదురుచూసిన అభ్యర్థులకు నిరాశ తప్ప లేదు. గత్యంతరం లేని పరిస్థితుల్లోనే గ్రూప్–2 మెయిన్స్ పరీక్షకు హాజరుకావాల్సి వచ్చింది. రోస్టర్ విధానంలో సవరింపులు చేసే వరకు పరీక్షను వాయి దా వేసే అధికారం ప్రభుత్వానికి ఉన్నప్పటికీ.. కనీ సం ఆ దిశగా కూటమి ప్రభుత్వం ఆలోచన చేయకపోవడాన్ని అభ్యర్థులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో గ్రాడ్యుయేట్ అభ్యర్థుల కోసం ఆఖరి నిమిషం ఎన్నో ఎత్తుగడలు, డ్రామాలు ఆడి పరీక్షను యథాతథంగా నిర్వహించేలా తెరవెనుక కుట్ర చేశారని అభ్యర్థులు గుర్తించారు. నెపాన్ని ఏపీపీఎస్సీపైకి నెట్టేయడంతో అభ్యర్థులు నిలువునా మోసపోయారు.
ఉదయం.. మధ్యాహ్నం
జిల్లాలో గ్రూప్–2 మెయిన్స్ పరీక్ష నిర్వహణకు 15 కేంద్రాలను కేటాయించారు. శ్రీకాకుళం మండలం పరిధిలో 8, ఎచ్చెర్ల మండల పరిధిలో 7 కేంద్రాల్లో పరీక్ష జరిగింది. ఉదయం 10 నుంచి 12.30 వరకు పేపర్–1 పరీక్ష, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5.30 వరకు పేపర్–2 పరీక్ష జరిగింది. మీడియాను సైతం లోనికి అనుమతించలేదు. పలు కేంద్రాల్లో క రెంట్ పోవడంతో ఉక్కపోతలతో అల్లాడిపోయారు.
పరీక్ష కేంద్రాల్లో అధికారులు తనిఖీ..
పరీక్ష కేంద్రాలపై అధికారులు ప్రత్యేకంగా నిఘా పెట్టారు. కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఎస్పీ కేవీ మహేశ్వర్‌రెడ్డితో కలిసి పలు కేంద్రాలను తనిఖీ చేశారు. ఎచ్చెర్లలోని శ్రీ వెంకటేశ్వర ఇంజనీరింగ్ కాలేజ్‌లో ఏర్పాట్లను, పరిస్థితులను పరిశీలించారు. 144 సెక్షన్‌ను పకడ్బందీగా అమలు చేశారు. పరీక్ష ప్రశాంతంగా ముగియడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
శ్రీకాకుళం కాకినాడ ఆదిత్య కాలేజీ వద్ద కేంద్రం లోపలకు వెళ్తున్న అభ్యర్థులు
శ్రీకాకుళంలో పరీక్ష
కేంద్రం లోపలకు వెళ్తున్న దివ్యాంగుడు
ఎచ్చెర్ల కేంద్రాల్లో ఇలా..
ఎచ్చెర్ల మండలంలో ఏడు పరీక్ష కేంద్రాల్లో ఏపీపీఎస్సీ గ్రూఫ్ –2 మెయిన్స్ పరీక్షలు ని ర్వహించారు. ప్రతి పరీక్ష కేంద్రం వద్ద పోలీస్ భద్రత ఏర్పాటు చేశారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయంలోని కాలేజ్ ఆఫ్‌సైన్స్, కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్, కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ లా, కామర్స్, ఎచ్చెర్లలోని శ్రీ వెంకటేశ్వర విద్యా సంస్థల్లో కాలేజ్ ఆఫ్ ఫార్మశీ, కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ, పాలిటెక్నిక్, చిలకపాలేంలోని శ్రీ శివానీ ఫార్మశీ కళాశాలల్లో పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్ష కేంద్రాలకు 3024 మంది అభ్యర్థులను కేటాయించారు. పరీక్ష కేంద్రాలను కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుడ్కర్, ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి, శ్రీకాకుళం డివిజన్ ఆర్డీఓ సాయిప్రత్యూష పరిశీలించారు.
పటిష్టంగా పోలీసు బందోబస్తు
శ్రీకాకుళం క్రైమ్ : ఆదివారం జరిగిన గ్రూప్–2 మెయిన్స్ పరీక్షలకు సంబంధించి పరీక్ష కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్‌తో పాటు ఎస్పీ మహేశ్వరరెడ్డి ఎచ్చెర్లలోని శ్రీ వెంకటేశ్వర ఇంజినీరింగ్ కళాశాలను సందర్శించారు. అనంతరం ఎస్పీ జిల్లాకేంద్రంలోని ఉమెన్స్ డిగ్రీ కళాశాల, నారాయణ స్కూళ్లను సందర్శించి ఏర్పాట్లను పర్యవేక్షించారు. సీఐలు సీహెచ్ పైడపునాయుడు, పి.ఈశ్వరరావు బందోబస్తు ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షించారు.
85 శాతం మంది పరీక్షకు హాజరు..
ఉదయం సెషన్‌కు 5,535 మంది పరీక్షకు హాజరుకావాల్సి ఉండగా 4,715 మంది పరీక్ష రాశారు. 820 మంది గైర్హాజరయ్యారు. 85.18 శాతం అభ్యర్థులు పరీక్ష రాశారు. అలాగే మధ్యాహ్నం సెషన్‌లో 5,535 మంది పరీక్ష రాయాల్సి ఉండగా 4704 మంది పరీక్షకు హాజరయ్యారు. వివిధ కారణాలతో 831 మంది గైర్హాజరయ్యారు. 84.99 శాతం మంది పరీక్షకు హాజరయ్యారు.
పరీక్ష ప్రశాంతం.. అభ్యర్థుల కష్టాలు
అనంతం
పటిష్ట బందోబస్తు నడుమ గ్రూప్–2 మెయిన్స్ పూర్తి
పరీక్ష వాయిదా వేస్తారేమోనని ఆఖరి
నిమిషం వరకు అభ్యర్థుల ఎదురుచూపు
ఆవేదనతోనే పరీక్షలకు హాజరైన నిరుద్యోగులు
జిల్లాలో 15 కేంద్రాల్లో పరీక్ష నిర్వహణ
ఉదయం సెషన్‌కు 85.18% ,
మధ్యాహ్నం సెషన్‌కు 84.99% హాజరు
No Headline
No Headline
No Headline
Comments
Please login to add a commentAdd a comment