శైవక్షేత్రాలకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు
శ్రీకాకుళం అర్బన్: మహాశివరాత్రి సందర్భంగా జిల్లాలోని ఆర్టీసీ డిపోల నుంచి వివిధ శైవ పుణ్య క్షేత్రాలకు ప్రత్యేకంగా ఆర్టీసీ బస్సులు నడుపుతున్న ట్లు జిల్లా ప్రజా రవాణా అధికారి ఎ.విజయ్‌కుమార్ తెలిపారు. శ్రీకాకుళం జిల్లా నుంచి మహాశివరాత్రికి 60 ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు పేర్కొన్నారు. అందులో భాగంగా రణస్థలం నుంచి రామతీర్థాలకు 30 ఆర్టీసీ బస్సులు, టెక్కలి నుంచి రావివలసకు 12 బస్సులు, పలాస నుంచి సాబకోటకు 12 బస్సులు, శ్రీముఖలింగానికి 6 ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు తెలిపారు. సాధారణ టికెట్ ధర చెల్లించి ప్రయాణికులు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించాలని, అవసరమైన పక్షంలో భక్తుల రద్దీని బట్టి ఇంకా అదనంగా ఆర్టీసీ బస్సులు నడుపుతామని పేర్కొన్నారు. ఆటోలు, ఇతర ప్రైవేటు వాహనాలను ఆశ్రయించకుండా సురక్షితమైన ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించి, ఆర్టీసి వారికి ప్రయాణికులు సహకరించాలని కోరారు. తదుపరి ఈ నెల 24వ తేదీన శ్రీకాకుళం నుంచి శ్రీశైలానికి ప్రత్యేకంగా ఒక సూపర్ లగ్జరీ బస్సు నడుపుతున్నట్లు పేర్కొన్నారు. శ్రీకాకుళం నుంచి శ్రీశైలం వెళ్లే ప్రత్యేక సర్వీసునకు ఆన్‌లైన్‌లో రిజర్వేషన్ సౌకర్యం కల్పించినట్లు పేర్కొన్నారు.
శైవక్షేత్రాలకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు
Comments
Please login to add a commentAdd a comment