రాష్ట్రంలో చంద్రన్న పగ, దగా పథకాలే..
మాట్లాడుతున్న వైఎస్సార్‌సీపీ ఉత్తరాంధ్ర రీజినల్ కో ఆర్డినేటర్ కురసాల కన్నబాబు. చిత్రంలో అరకు ఎంపీ తనూజరాణి, విశాఖ, విజయనగరం,
శ్రీకాకుళం జిల్లాల అధ్యక్షులు గుడివాడ అమర్‌నాథ్,
మజ్జి శ్రీనివాసరావు,
ధర్మాన కృష్ణదాస్, పార్టీ నేతలు
సాక్షి, విశాఖపట్నం: కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచి రాష్ట్రంలో చంద్రన్న పగ.. చంద్రన్న దగా సంక్షేమ పథకాలే అమలవుతున్నాయని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు అన్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల్లో ఒకటి కూడా పూర్తి స్థాయిలో అమలుచేసిన పాపా న పోలేదని, ఈ ప్రభుత్వంపై ప్రజల్లో విశ్వాసం లేదని పేర్కొన్నారు. ఆదివారం మద్దిలపాలెంలోని పార్టీ కార్యాలయంలో పార్టీ ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్‌గా ఆయన బాధ్యతలు స్వీకరించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఉత్తరాంధ్ర సమన్వయకర్తగా బృహత్తరమైన బాధ్యతను అప్పగించిన పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఉత్తరాంధ్ర అంటే ఉద్యమాలకు పురిటి గడ్డలాంటిదని, ఈ ప్రాంత ప్రజలు ఉద్యమిస్తే.. సాధించేవరకూ పట్టువదలరని కొనియాడారు. అలాంటి ఈ ప్రాంత అభివృద్ధి కోసం విశాఖ నగరాన్ని పరిపాలన రాజధానిగా చేసేందుకు అన్నివిధాలా తమ నాయకుడు జగన్‌మోహన్‌రెడ్డి కృషిచేశారన్నారు. ప్రజలకు ఏమైతే మాట ఇస్తారో.. అది చేయడం వైఎస్ జగన్ నైజమన్నారు. అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ప్రజల్ని పూర్తి గా విస్మరించిందన్నారు. వారిచ్చిన ప్రతి హామీని అమలుచేసేలా వైఎస్సార్ సీపీ ప్రజల తరఫున పోరాడుతుందని పేర్కొన్నారు. కూటమి 8 నెలల పాలనలో రూ.లక్షా 20 వేల కోట్లు అప్పుచేసిన సీఎం చంద్రబాబు.. ప్రజల కోసం ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఉన్న అన్ని సేనల కన్నా వైఎస్ జగన్ సేన స్ట్రాంగ్‌గా ఉందని, ఆయన కోసం ప్రాణాలు ఇచ్చే కోట్లాది మంది కార్యకర్తలు, ప్రజలు, అభిమానులున్నారన్నారు. వైఎస్సార్‌సీపీ నుంచి ఒకరిద్దరు వెళ్లినంత మాత్రాన ఎలాంటి నష్టం లేదన్నారు.
గ్రూప్–2 అభ్యర్థుల యువగళం చూశాం
ఎన్నికలకు ముందు లోకేష్ యువగళమంటూ తిరిగాడు.. అసలుసిసలైన యువగళం విశాఖ కేంద్రంగా గ్రూప్–2 అభ్యర్థులు చేశారని కన్నబాబు అన్నారు. గ్రూప్–2 పరీక్ష వాయిదా వేస్తామంటూ నమ్మించి అభ్యర్థులను చంద్రబాబు మోసం చేశారన్నారు. కార్యక్రమంలో శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ, అరకు ఎంపీ తనూజరాణి, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల అధ్యక్షులు గుడివాడ అమర్‌నాథ్, మజ్జి శ్రీనివాసరావు, ధర్మాన కృష్ణదాస్, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి, మేయర్ గొలగాని హరి వెంకటకుమారి, మాజీ ఎమ్మెల్యేలు కరణం ధర్మశ్రీ, వాసుపల్లి గణే ష్‌కుమార్, తిప్పల నాగిరెడ్డి, అన్నంరెడ్డి అదీప్‌రాజ్, తైనాల విజయకుమార్, చింతలపూడి వెంకట్రామయ్య, సమన్వయకర్తలు కేకే రాజు, తిప్పల దేవన్‌రెడ్డి, మాజీ ఎంపీ గొడ్డేటి మాధవి, జీసీసీ మాజీ చైర్‌పర్సన్ శోభా స్వాతిరాణి, కార్పొరేటర్లు బాణాల శ్రీనివాసరావు, పీవీ సురేష్, సాడి పద్మారెడ్డి, ఇమ్రాన్, ముఖ్యనేతలు కోలా గురువులు, రొంగల జగన్నాథం, చొక్కాకుల వెంకట్రావ్, మొల్లి అప్పారావు, రవిరెడ్డి, పేర్ల విజయచందర్, కాయల వెంకటరెడ్డి, పేడాడ రమణికుమారి, మారుతీప్రసాద్, బోని శివరామకృష్ణ, శ్రీదేవి వర్మ, మాధవివర్మ, పీలా వెంకటలక్ష్మి, కాళిదాస్‌రెడ్డి, సనపల రవీంద్ర భరత్, అల్లంపల్లి రాజు బాబు, రాష్ట్ర, జిల్లా అనుబంధ విభాగాల అధ్యక్షులు పాల్గొన్నారు.
కూటమి ప్రభుత్వం ప్రజల్లో విశ్వాసం కోల్పోయింది
ప్రజల పక్షాన వైఎస్సార్ సీపీ పోరాడుతుంది
వైఎస్సార్ సీపీ ఉత్తరాంధ్ర రీజినల్ కోఆర్డినేటర్‌గా కన్నబాబు బాధ్యతల స్వీకరణ
Comments
Please login to add a commentAdd a comment