ఇసుకాసురుల బరితెగింపు
పొందూరు: పొందూరు, ఆమదాలవలస మండలాల్లో నిర్వహిస్తున్న అక్రమ ఇసుక ర్యాంపులను పరిశీలించేందుకు వెళ్లిన వైఎస్సార్‌సీపీ నియోజకవర్గం ఇన్‌చార్జి చింతాడ రవికుమార్‌ను టీడీపీ గూండాలు ఆదివారం అడ్డుకున్నారు. పొందూరు మండలంలోని బొడ్డేపల్లి, ఆమదాలవలస మండలంలోని నెల్లిమెట్ట గ్రామాల్లోని ఇసుక ర్యాంపుల్లోకి వెళ్లనీయకుండా ద్విచక్రవాహనాలను అడ్డుగా పెట్టారు. అక్కడితో ఆగకుండా గెడ్డపారలతో దాడికి దిగి చింతాడ రవికుమార్ ఆయన అనుచరులను భయభ్రాంతులకుగురిచేశారు. ప్రాణాలు కాపాడుకోవాలంటే తిరి గి రాకూడదని హెచ్చరించారు. దీంతో ‘ఈ రోజు మీరు అడ్డుకున్నా.. ఇక్కడితో అయిపోయేది కాదు’ అని చింతాడ రవికుమార్ ధీటుగా స్పందించారు. అక్కడే విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ తమను అడ్డుకోవడం టీడీపీ దాష్టీకానికి నిదర్శనమని అన్నారు. అనుమతులు లేని ఈ బొడ్డేపల్లి ర్యాంపు నిర్వహణను చూసేందుకు వెళ్తుంటే గూండాలను పెట్టి అ డ్డుకుంటున్నారని చెప్పారు. తమ మీద దాడులు చేయడానికి పెద్ద ఎత్తున వచ్చారని తెలిపారు. ఉచి త ఇసుక విధానం ప్రకారం టెండర్‌లు పిలిచి రీచ్ లు ఏర్పాటు చేయాలని, దీనికి విరుద్ధంగా ఇక్కడ ర్యాంపు జరుగుతోందని తెలిపారు. ఈ ర్యాంపులో మిషన్లు దించేసి రోజుకు 250 నుంచి 300 లారీలు ఇక్కడ నుంచే వెళ్తున్నాయని పేర్కొన్నారు. ఆమదాలవలస మండలంలోని కాఖండ్యాం, ముద్దాడపేట, పురుషోత్తపురం–1, 2, తోటవాడ అనుమతులున్న రీచ్‌ల్లోనే రోజుకు కోట్ల రూపాయలను దోచేస్తున్నారని అన్నారు.
రైల్వే బ్రిడ్జిని ఆనుకుని సుమారు వంద మీటర్ల దూ రంలోనే ఈ ఇసుక ర్యాంపులను నడుపుతున్నారని అన్నారు. కాఖండ్యాం నుంచి తోటాడ వరకు గల వంశధార, నాగావళి నదుల్లో అక్రమ ఇసుక తవ్వకాలను జరిపిస్తున్నారని ఆరోపించారు. ఇసుక అక్రమ రవాణాను కచ్చితంగా అడ్డుకుంటామని చెప్పారు. ఈ సమస్యపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయిస్తామని, లోకాయుక్తలో కేసు వేస్తామని హెచ్చరించారు. ఆయనతో పాటు వైఎస్సార్‌సీపీ నాయకులు బొడ్డేపల్లి రమణ, చింతాడ ప్రసాద్, గురుగుబెల్లి శేఖర్, పైడి నాగభూషణరావు, తమ్మినేని రవి, అన్నెపు నితిన్, పైడి పోలయ్య పాల్గొన్నారు.
అక్రమ ఇసుక ర్యాంపులను
పరిశీలించేందుకు వెళ్లిన వైఎస్సార్‌సీపీ నాయకుడు చింతాడ రవికుమార్
ర్యాంపులకు వెళ్లనీయకుండా అడ్డుకున్న టీడీపీ గూండాలు
దారికి అడ్డుగా ద్విచక్ర వాహనాలు పెట్టి తిరిగి వెళ్లిపోవాలని బెదిరించిన వైనం
ఇసుకాసురుల బరితెగింపు
Comments
Please login to add a commentAdd a comment