ఉత్కంఠభరితంగా చదరంగం పోటీలు
టెక్కలి: చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం టెక్కలి ఓక్లాండ్ పాఠశాలలో నిర్వహించిన అండర్–15 చదరంగం పోటీలు ఉత్కంఠభరితంగా జరిగాయి. ఇండియా చెస్ ఇన్ స్కూల్స్ ట్రైనర్ ఎస్.భీమారావు పర్యవేక్షణలో నిర్వహించిన ఈ పోటీల్లో జిల్లా వ్యాప్తంగా 40 మంది క్రీడాకారులు హాజరయ్యారు. పలాసకు చెందిన కె.కల్పక్ ప్రథమ స్థానంలో నిలిచాడు. శ్రీకాకుళానికి చెందిన బి.కార్తీకేయ ద్వితీయ స్థానంలో నిలిచాడు. మూడో స్థానంలో బి.యశ్వంత్, నాల్గో స్థానంలో బి.జీవన్ విజయం సాధించారు. జూనియర్స్ విభాగంలో పలాసకు చెందిన కె.లిపిక, టెక్కలికి చెందిన ఎస్.రిత్విక్‌సాయి, కె.రాహుల్ విజయం సాధించారు. విజేతలకు నాయకులు బి.శేషగిరి చేతుల మీదుగా బహుమతులు అందజేశారు.
120 కిలోల నాగాభరణం తయారు
సారవకోట: మండలంలోని బుడితి కంచు, ఇత్తడి కార్మికులు నెల రోజులు శ్రమించి 120 కిలోల నాగాభరణం తయారు చేశారు. జలుమూరు మండలంలోని పాగోడు సమీపంలోని కొత్తూరు గ్రామంలో గల శివాలయం శిఖరం పై శివలింగం ఏర్పాటు చేసేందుకు ఆ గ్రామస్తులు దీన్ని తయారు చేయించారు. బుడితి గ్రామానికి చెందిన అద్దాల రామకృష్ణ, సూర్యకళలు సుమారు నెల రోజులు పాటు శ్రమించి 120 కిలోల ఇత్తడితో తయారు చేశారు.
చింతాడను అడ్డుకోవడం అమానుషం
పొందూరు: బొడ్డేపల్లి, నెల్లిమెట్ట గ్రామా ల్లో జరుగుతున్న అక్రమ ఇసుక ర్యాంపులను పరిశీలించేందుకు వెళ్లిన వైఎస్సార్‌సీపీ ఆమదాలవలస నియోజకవర్గం ఇన్‌చార్జి చింతాడ రవికుమార్‌ను టీడీపీ గూండాలు అడ్డుకోవడం అమానుషమని వైఎస్సార్‌సీపీ క ళింగ సామాజికి సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, రాష్ట్ర కళింగ కార్పొరేషన్ మాజీ చైర్మన్ దుంపల లక్ష్మణరావు(రామారావు) అన్నారు. ఇలాంటి దుశ్చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నానని చెప్పారు. చవకబారు రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్సుగా టీడీపీ మారిందని దుయ్యబట్టారు. ఇలాంటి సంఘటనలు జరగకుండా పోలీసు యంత్రాంగం, అధికార యంత్రాంగం రక్షణ కల్పించాలని కోరారు. దీనిపై కలెక్టర్ తగు చర్యలు తీసుకోవాలని కోరారు.
ఉత్కంఠభరితంగా చదరంగం పోటీలు
ఉత్కంఠభరితంగా చదరంగం పోటీలు
Comments
Please login to add a commentAdd a comment