కె.జె.పురం ఫీల్డ్ అసిస్టెంట్ సస్పెన్షన్
సారవకోట: మండలంలోని కె.జె.పురం ఫీల్డ్ అసిస్టెంట్ కుమారస్వామిని సస్పెండ్ చేసినట్లు ఎంపీడీఓ మోహన్‌కుమార్ మంగళవారం తెలిపారు. గత ఏడాది జరిగిన సామాజిక తనిఖీల్లో సుమారు రూ.5 లక్షలు రికవరీ గుర్తించడంతో పాటు ప్రతి వారం జరిగే సాధారణ సమావేశాలకు హాజరు కాకపోవడం, ఇటీవల కమిషన్ పెట్టిన సమావేశానికి సైతం హాజరు కాకపోవడంతో తాత్కాలికంగా విధుల నుంచి తప్పిస్తున్నట్లు ఆయన చెప్పారు.
డీఐజీని కలిసిన ఎస్పీ
శ్రీకాకుళం క్రైమ్ : జిల్లాకు మంగళవారం విచ్చేసిన విశాఖపట్నం రేంజి డీఐజీ గోపినాథ్ జెట్టిని ఎస్పీ కె.వి.మహేశ్వరరెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లా పోలీసు కార్యాలయంలో సాదరంగా ఆహ్వానించి పూలమొక్కను అందజేశారు.
శ్రీముఖలింగంలో చోరీ
జలుమూరు: శ్రీముఖలింగం కాళింగ వీధిలో కాంచనమాల పట్కక్ ఇంట్లో చోరీ జరిగింది. దుండగులు చొరబడి సుమారు రూ.1.50 లక్షలు నగదు, ఎనిమిది తులాల బంగారం, ఎనిమిది కేజీల వెండి చోరీకి గురైంది. కాంచనమాల వారం కిందట శ్రీకాకుళంలోని తన కుమార్తె ఇంటికి వెళ్లి మంగళవారం సాయంత్రం శ్రీముఖలింగం చేరుకుంది. ఇంటికి వచ్చి చూసేసరికి ప్రధాన తలుపు బద్దలు కొట్టి ఉంది. లోపలికి వెళ్లి చూడగా బీరువా లాకర్ బద్దలు కొట్టి ఉంది. అందులో నగదు, వెండి సామగ్రి, బంగారం కనిపించకపోవడంతో జలుమూరు పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు ఆమె తెలిపింది.
వలస కూలీ అదృశ్యం
ఎచ్చెర్ల క్యాంపస్: ఎచ్చెర్ల మండలం భగీరథపురం గ్రామానికి చెందిన తంగి సుబ్బారావు కొన్నాళ్లుగా రాజమండ్రిలో తాపీపనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. పని పూర్తయ్యాక రాత్రి 8 గంటల సమయంలో అందరూ మెస్‌కు చేరుకుంటారు. ఆదివారం సాయంత్రం కిరాణా షాప్‌కు వెళ్లి తిరిగి రాలేదు. వెతికినా ఆచూకీ కనిపించలేదు. అక్కడి పోలీస్‌స్టేషన్‌లో సైతం ఫిర్యాదు చేశారు. సుబ్బారావు ఆచూకీ కోసం గ్రామస్తులు, కుటుంబ సభ్యులు ప్రయత్నిస్తున్నారు.
ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన ఎంఈఓ
సాక్షి టాస్క్‌ఫోర్స్: ఈ నెల 27న ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పాకలపాటి రఘువర్మను గెలిపించాలని కోరుతూ పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు మంగళవారం పాతపట్నంలోని తన కార్యాలయంలో ఐదు మండలాల కూటమి నాయకులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ప్రభుత్వ ఉద్యోగులు ఇటువంటి సమావేశాలకు హాజరుకాకూడదు. మెళియాపుట్టిలో మండల విద్యాశాఖ అధికారిగా పనిచేస్తున్న సవర దేవేంద్రరావు మాత్రం ఈ కార్యక్రమానికి హాజరై కోడ్ ఉల్లంఘించారు. ఈ ఘటనపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని వైఎస్సార్ సీపీ నాయకులు కోరుతున్నారు.
కూటమి నాయకులతో కలిసి సమావేశంలో కూర్చున్న మెళియాపుట్టి ఎంఈఓ సవర దేవేంద్రరావు
కె.జె.పురం ఫీల్డ్ అసిస్టెంట్ సస్పెన్షన్
కె.జె.పురం ఫీల్డ్ అసిస్టెంట్ సస్పెన్షన్
కె.జె.పురం ఫీల్డ్ అసిస్టెంట్ సస్పెన్షన్
Comments
Please login to add a commentAdd a comment