చికిత్స పొందుతూ యువకుడు మృతి
టెక్కలి రూరల్: మండలంలోని లచ్చన్నపేట సమీపంలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన బెండి అభిరామ్(18) అనే యువకుడు మంగళవారం శ్రీకాకుళం రిమ్స్‌లో చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతుడిది టెక్కలి మండలం జయకృష్ణపురం గ్రామం. గోపినాథపురం సమీపంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. ఫేర్‌వెల్ డే సందర్భంగా స్నేహితుడిని తీసుకొచ్చేందుకు నందిగాం మండలం తామరాపల్లి వెళ్లి తిరిగి వస్తుండగా బైక్ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. తీవ్ర గాయాలపాలైన అభిరామ్‌ని టెక్కలి జిల్లా ఆస్పత్రికి, అక్కడి నుంచి శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. పరిస్థితి విషమించడంతో మంగళవారం మృతిచెందారు. టెక్కలి పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం మృతదేహాన్ని అతని స్నేహితులు జగతిమెట్ట జంక్షన్ నుంచి మృతుడి స్వగ్రామమైన జయకృష్ణాపురం వరకు ర్యాలీగా తీసుకువెళ్లారు. కాగా, ఒక్కగానొక్క కుమారుడు మృతిచెందడంతో తల్లిదండ్రులు బెండి వనజాక్షి, గణేష్ శోకసంద్రంలో మునిగిపోయారు.
Comments
Please login to add a commentAdd a comment