జిల్లా సరిహద్దులో డ్రోన్ నిఘా
శ్రీకాకుళం క్రైమ్/ఇచ్ఛాపురం : ఒడిశా సరిహద్దులోని ఇచ్ఛాపురం టౌన్ పరిధిలో అసాంఘిక కార్యకలాపాల అడ్డుకట్టలో భాగంగా డ్రోన్ కెమెరాతో మరింత నిఘా పెంచుతున్నామని ఎస్పీ కె.వి.మహేశ్వరరెడ్డి అన్నారు. గంజాయి అక్రమ రవాణా, క్రయ విక్రయాలు జరగకుండా నిలువరిస్తామని చెప్పారు. మంగళవారం ఇచ్ఛాపురం పట్టణ పరిధిలోని ఈదుపురం, పురుషోత్తపురం, బహుదా నదీ పరివాహక ప్రాంతాలతో పాటు జిల్లాకేంద్రంలోని శాంతినగర్, భైరివానిపేట, బలగ, నాగావళి నదీ పరీవాహక, నిర్మానుష్య ప్రాంతాల్లో డ్రోన్ కెమెరాతో పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ బహిరంగంగా మద్యం సేవించడం, గంజాయి తాగడం, విద్యార్థినులను వేధించడం, పేకాట, జూదం ఇతర కార్యకలాపాలను అరికట్టడంలో భాగంగానే డ్రోన్ నిఘా పెడుతున్నామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment