బొడ్డేపల్లిలో ఇసుక తవ్వకాలపై ఆరా
పొందూరు: మండలంలోని బొడ్డేపల్లిలో జరుగుతున్న ఇసుక అక్రమ ర్యాంపును తహశీల్దార్ వెంకటేష్ రామానుజులు, ఎస్‌ఐ వి.సత్యనారాయణ మంగళవారం పరిశీలించారు. వైఎస్సార్‌సీపీ ఆమదాలవలస నియోజకవర్గ ఇన్‌చార్జి చింతాడ రవికుమార్ రెండు రోజుల క్రితం బొడ్డేపల్లి, నెల్లిమెట్ట ర్యాంపులను పరిశీలించడానికి వెళ్లిన సందర్భంలో టీడీపీ సామాజికవర్గ నాయకులు అడ్డుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అధికారులు పరిశీలన చేశారు. ర్యాంపులో ఆరు ట్రాక్టర్లు, ఐదుగురు కూలీలు ఉన్నారని, ఇకపై రోజూ పరిశీలనలు చేస్తామని తెలిపారు. ఇక్కడ లోతుగా తవ్వకాలు జరిగినట్లు గుర్తించామన్నారు. పూసపాటిరేగ, లావేరు నుంచి వచ్చి ట్రాక్టర్లతో ఇసుకను తీసుకెళ్తున్నట్లు గుర్తించామని, ర్యాంపులో యంత్రాలు లేవని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment