● ఎందుకింత అడ్డుగోలు తనం...
సాఽదారణంగా పంచాయతీల్లో ఏ పనులు చేపట్టినా సర్పంచ్‌ల నేతృత్వంలో పంచాయతీ కార్యవర్గం ఆధ్వర్యంలో జరగాలి. మండల పరిషత్ నిధులతో చేపట్టే పనులు ఎంపీటీసీ, జెడ్పీటీసీల ఆధ్వర్యంలో జరుగుతాయి. పంచాయతీల తీర్మానంతోనే ఏదైనా జరగాలి. కానీ, ప్రస్తుతం తీర్మానాల వరకే సర్పంచ్, ఎంపీటీసీలు, జెడ్పీటీసీ, ఎంపీపీలని, పనులు వచ్చేసరికి తమ పార్టీలకు చెందిన నాయకులకేనని చెప్పేస్తున్నారు. సర్పంచ్‌లు కేవలం తీర్మానాలకే పరిమితమని తెగేసి చెప్పేస్తున్నారు. గతంలో జన్మభూమి కమిటీ సభ్యులు ఉన్నట్టుగా ఇప్పుడు వెండర్ పేరుతో గ్రామస్థాయిలో కొంతమంది టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులను ఎంపిక చేసి, వారి పేర్లనే జిల్లా జల యాజమాన్య సంస్థ(డ్వామా)లో రిజిస్ట్రేషన్ చేసి, వారికే గ్రామస్థాయి పనులు కాంట్రాక్ట్ అప్పగించి, వారి పేరున బిల్లులు మంజూరు చేస్తున్న పరిస్థితులు నెలకొ న్నాయి. వెండర్స్ పేరుతో కూటమి నాయకుల పేర్లు శిలాఫలాకాల్లోనూ వేస్తున్నారు. ప్రజలు ఎన్నుకున్న వారిని మాత్రం విస్మరిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment