కాశీబుగ్గ పోలీసులకు చుక్కెదురు
కాశీబుగ్గ: పేకాట రాయుళ్లను పట్టుకోవడానికి వెళ్లి పొరపాటున ఒడిశా భూభాగంలోకి వెళ్లిన కాశీబుగ్గ పోలీసులకు చుక్కెదురైంది. ఆంధ్రా–ఒడిషా సరిహద్దులో జూదం ఆడుతున్నారన్న సమాచారం మేరకు కాశీబుగ్గ పోలీసులు ఒడిశా పోలీసులకు సమాచారం ఇవ్వకుండా సోమ వారం అర్ధరాత్రి వేళ రాష్ట్ర సరిహద్దులు దాటి వెళ్లడం వివాదాస్పదమైంది. పేకాటరాయుళ్లను అదుపులోకి తీసుకుని వాహనాలలో ఎక్కించి త రలించగా స్థానికులు అడ్డుకున్నారు. గజపతి జిల్లా ఎస్పీకి కాశీబుగ్గ పోలీసులపై ఫిర్యాదు చేశారు. ఈ తరుణంలో కాశీబుగ్గ సీఐ సూర్యనారాయణ బృందంతో పాటు రెండు వాహనాలను ఒడిశా సరిహద్దులో గురండి పోలీసుస్టేషన్ సమీపంలో స్థానికులు అడ్డుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment