నిధుల గోల్‌మాల్‌పై ఫిర్యాదు
హిరమండలం: మండలంలోని తంప పంచాయతీలో నిధుల దుర్వినియోగంపై కలెక్టర్‌కు ఫిర్యాదు అందింది. గ్రామానికి చెందిన మామిడి చిన్నబాబు అనే వ్యక్తి ఫిర్యాదు చేయడంతో కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ స్పందించారు. విచారణ చేపట్టాలని డీపీవోకు ఆదేశించారు. పంచాయతీకి చెందిన 15వ ఆర్థిక సంఘం నిధులు, సాధారణ నిధులను సర్పంచ్ పక్కదారి పట్టించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నాడు. పోలీస్ శాఖలో పనిచేసిన విశ్రాంత ఉద్యోగి అయినటువంటి తన పేరును ఉప సర్పంచ్‌గా రికార్డుల్లో చూపి దుర్వినియోగం చేసినట్లు వాపోయాడు.
న్యాయం చేయండి
నందిగాం: చట్టబద్ధంగా కొనుకున్న ఇంటిని ఖాళీ చేయించి, దౌర్జన్యంగా ఆక్రమించుకుంటున్నారని మండలంలోని కొత్తగ్రహారానికి చెందిన ఏదూరు లక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ సోమేశ్వరరావుకు సోమవారం ఫిర్యాదు చేశారు. 2022 మార్చి 30వ తేదీన కొత్త అగ్రహారంలో ఉన్నటువంటి ఇల్లు, ఖాళీ స్థలాన్ని పొట్నూరు ఆనందరావు, అతని సోదరులు, సోదరి తనకు అమ్మినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు కాశీబుగ్గ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేశారని తెలియజేశారు. అప్పటినుంచి ఆ ఇంట్లోనే తాను, తన పిల్లలు, అత్తతో కలిసి ఉంటున్నానని తెలిపారు. భర్త గల్ఫ్ దేశంలో పని చేస్తున్నాడని పేర్కొన్నారు. అయితే గ్రామానికి చెందిన దుంప కృష్ణారావు మరలా ఆనందరావుతో కోటబొమ్మాళి రిజిస్ట్రేషన్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేయించుకొని, ఇంటి నుంచి తమను వెళ్లగొట్టడానికి పలుమార్లు దాడులు చేశారని వాపోయారు. కోర్టులో కేసు నడుస్తున్నా, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆడవారు, పిల్లలపై ఈ దాడులు మరింత తీవ్రంచేస్తూ దౌర్జన్యానికి దిగారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై నందిగాం పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదన్నారు. ఈ విషయంపై మంత్రి అచ్చెన్నాయుడిని కలిసినా న్యాయం జరగలేదని తెలిపారు. అనంతరం దుంప కృష్ణారావు తదితరులు ఇంట్లో సామాన్లు పగలుగొట్టి, దాడులు చేసి ఇంటి నుంచి గెంటేశారని తెలిపారు. దీంతో ప్రస్తుతం వేరే వాళ్ల ఇంట్లో తలదాచుకుంటున్నామని తెలిపారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని, లేకుంటే ఆత్మహత్యే శరణ్యమని పేర్కొన్నారు.
మృతుడు అంబకండి వాసిగా గుర్తింపు
పొందూరు: స్థానిక రైల్వేగేటు సమీపంలో ఆదివారం జరిగిన రైలు ప్రమాదంలో మృతి చెందిన యువకుడు రేగిడి ఆమదాలవలస మండలంలోని అంబకండి గ్రామానికి చెందిన బోడిసింగి వెంకటరమణ(25)గా గుర్తించినట్లు సోమవారం జీఆర్పీ ఎస్‌ఐ ఎస్.మధుసూదనరావు తెలిపారు. మృతుడు విజయవాడలో తాపీ పనులు చేస్తుంటాడని, వారం రోజుల క్రితం ఊరు వచ్చాడని పేర్కొన్నారు. తిరిగి మరలా విజయవాడ వెళ్లేందుకు పొందూరు రైల్వేస్టేషన్‌కు వచ్చాడన్నారు. ఈ క్రమంలో రైలు పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొనడంతో మృతి చెందినట్లు తండ్రి చిన్నారావు ఫిర్యాదు చేశారన్నారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు వెల్లడించారు.
ఆదిత్యుని హుండీ
కానుకల లెక్కింపు నేడు
అరసవల్లి: అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆల య హుండీ కానుకల లెక్కింపు ప్రక్రియ మంగళవా రం ఉదయం 8 గంటల నుంచి అనివెట్టి మండపంలోనిర్వహిస్తున్నట్లుగా ఆలయ ఈఓ వై.భద్రాజీ ప్రక టనలో తెలియజేశారు. ఈమేరకు నిబంధనల ప్రకా రంగ్రామపెద్దలు, ఆలయ పాలకమండలి సభ్యులు, అఽధికారులు, ప్రధానార్చకులు సమక్షంలో హుండీ లను తెరిపించి లెక్కింపును చేపడతామని ఆయన వివరించారు.