శ్రీకాకుళం పాతబస్టాండ్: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాల (బాలికలు/బాలురు) 2025–2026 విద్యా సంవత్సరానికి గాను 5వ తరగతి, ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరంలో చేరేందుకు ఏప్రిల్ 6న జరగాల్సిన పరీక్షలు ఏప్రిల్ 13 నాటికి వాయిదా పడినట్లు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల విద్యాలయ సంస్థ జిల్లా సమన్వయాధికారి ఎన్.బాలాజీ తెలిపారు. విద్యార్థులు పరీక్షల్లో మార్పులు గమనించాలని. సందేహాలు ఉంటే 9701736862 – 8331005217 – 08942– 279926 నంబర్లను సంప్రదించాలన్నారు.
నాటుసారాతో దొరికిన టీడీపీ ఎంపీటీసీ సభ్యుడు
కంచిలి: కుంబరినౌగాం టీడీపీ ఎంపీటీసీ సభ్యుడు సింహాద్రి జన్ని నాటుసారాతో ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ పోలీసులకు పట్టుబడ్డారు. సింహాద్రి జన్ని ఇంట్లో 5 లీటర్ల నాటుసారా నిల్వ ఉందని సమాచారం రావడంతో సోంపేట ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ సీఐ కె.బేబీ ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి దాడి చేసి పట్టుకున్నారు. ఈ విషయమై సిఐ బేబీ మాట్లాడుతూ.. నాటుసారా అమ్ముతున్నారని సమాచారం రావడంతో దాడిచేసి పట్టుకుని కేసు నమోదు చేసి, అరెస్టు చేశామని తెలిపారు.
తొలిరోజు ఏపీపీఎస్సీ పరీక్షలు ప్రశాంతం
శ్రీకాకుళం పాతబస్టాండ్: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) మూడు విభాగాల పోస్టులకు సంబంధించిన నిర్వహిస్తున్న కంప్యూటర్ ఆధారిత పరీక్షలు తొలి రోజు ప్రశాంతంగా ముగిశాయి. జిల్లా రెవెన్యూ అధికారి ఎం.వెంకటేశ్వరరావు ఎచ్చెర్ల శివాని ఇంజనీరింగ్ కాలేజీ పరీక్ష కేంద్రం వద్ద భద్రత, వైద్య సదుపాయాలు, విద్యుత్ సరఫరా, రవాణా సౌకర్యాలు, పరీక్షలు జరుగుతున్న తీరు తెన్నులను మంగళవారం పరిశీలించారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్‌లో అసిస్టెంట్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీర్, విశ్లేషకుడు గ్రేడ్–ఐఐ, డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ పోస్టులకు మార్చి 25 నుంచి 27 వరకు పరీక్షలు జరుగనున్నాయి. శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, ఎచ్చెర్లలో జరిగిన పరీక్షకు ఉదయం సెషన్‌లో 100 మంది విద్యార్థులకు గాను 50 మంది గైర్హాజరయ్యారు. సాయంత్రం సెషన్‌లో 68 మంది విద్యార్థులకు గాను 41 మంది గైర్హాజరయ్యారు. శ్రీ శివాని కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, చిలకపాలెంలో జరిగిన పరీక్షకు ఉదయం సెషన్ లో 124 మంది విద్యార్థులకు గాను 56 మంది గైర్హాజరయ్యారు. మధ్యాహ్నం సెషన్‌లో 69 మంది విద్యార్థులకు గాను 31 మంది గైర్హాజరయ్యారు. కోర్ టెక్నాలజీ నరసన్నపేటలో జరిగిన పరీక్షకు 319 మంది విద్యార్థులకు గాను 171 మంది గైర్హాజరయ్యారు.
జాబ్‌మేళా నేడు
శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, సొసైటీ ఫర్ ఎంప్లాయిమెంట్ జనరేషన్ ఎంటర్‌ప్రైజ్ డెవలప్‌మెంట్ ఆధ్యర్యంలో ఈ నెల 26న జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు డీఆర్‌డీఏ పీడీ కిరణ్‌కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. పలాసలోని మండల మహిళా సమాఖ్య కార్యాలయంలో ఉదయం 9.30నుంచి సాయంత్రం 4 గంటల వరకు మేళా జరుగుతుందని పేర్కొన్నారు. ఫ్యూషన్ ఫైనాన్స్ కంపెనీలో రిలేషన్‌షిప్ ఆఫీసర్, శ్రీసిటీలోని బ్లూస్టార్ కంపెనీలో ఆపరేటర్, శ్రీసిటీలోని యూనికార్న్ కంపెనీలో ఆపరేటర్ల పోస్టులకు ఇంటర్వ్యూలు జరుగుతాయని పేర్కొన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు సర్టిఫికెట్లు, ధ్రువపత్రాలతో హాజరుకావాలని, పూర్తి వివరాలకు 81065 08318 నంబరును సంప్రదించాలని కోరారు.
27న పరిశ్రమల అవగాహన సదస్సు
శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లాలోని సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల అభివృద్ధి కోసం మేధో సంపత్తి హక్కులపై ఈ నెల 27న ఉదయం 10 గంటల నుంచి ఎచ్చెర్ల అంబేడ్కర్ యూనివర్సిటీలో అవగాహన సదస్సు నిర్వహించనున్నట్లు పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ శ్రీధర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రపంచ బ్యాంకు సహాయంతో రాంప్ పథకం కింద ఏపీఎంఎస్‌ఎంఈ స్పాన్సర్ చేసిన ఈ కార్యక్రమాన్ని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఎంఎస్‌ఎంఈ జిల్లా పరిశ్రమల కేంద్రం సహకారంతో నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఎంఎస్‌ఎంఈ యజమానులు, ఉద్యోగులు, స్టార్టప్ వ్యవస్థాపకులు, వ్యాపారవేత్తలు, విద్యార్థులు, పరిశోధకులు హాజరుకావచ్చని, ముందుగా డాక్టర్ గడ్డం సుదర్శన్ (9494959108)ని సంప్రదించి పేరు నమోదు చేసుకోవాలని సూచించారు.
గురుకుల ప్రవేశ పరీక్ష వాయిదా
గురుకుల ప్రవేశ పరీక్ష వాయిదా