
భాషా శాస్త్రవేత్తల సదస్సుకు గౌరీశంకర్
శ్రీకాకుళం కల్చరల్: తెలంగాణలోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఈ నెల 25, 26 తేదీల్లో కేంద్రీయ భాషా ప్రాధికార సంస్థ, తెలుగు భాషా వేదిక, ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు విభాగం సంయుక్తంగా నిర్వహించిన 13వ అంతర్జాతీయ భాషా శాస్త్రవేత్తల సదస్సులో మునసబుపేటలోని గాయత్రీ కాలేజ్ ఆఫ్ సైన్స్ అండ్ మేనేజ్‌మెంట్‌లో తెలుగు విభాగాధిపతి భమిడిపాటి గౌరీశంకర్ పాల్గొన్నారు. నూతన విద్యావిధానం–భారతీయ భాషలు అనే అంశంపై పత్ర సమర్పణ చేసి ప్రశంసలు అందుకున్నారు. ఈ సందర్భంగా గౌరీశంకర్‌ను గాయత్రీ విద్యాసంస్థల అధినేత జి.వి.స్వామినాయుడు, ప్రిన్సిపాల్ పులఖండం శ్రీనివాసరావు, వైస్ ప్రిన్సిపాల్ కె.వి.వి.సత్యనారాయణ, డాక్టర్ మార్తాండ కృష్ణ, సీతారాంనాయుడు, మేజర్ వి.మహేష్ అభినందించారు.