శ్రీకాకుళం అర్బన్: శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తుల సౌకర్యార్థం భద్రాచలానికి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడ పనుందని ఆర్టీసీ శ్రీకాకుళం ఒకటి, రెండు డిపోల మేనేజర్‌లు హనుమంతు అమరసింహుడు, కేఆర్‌ఎస్ శర్మలు తెలిపారు. శ్రీకాకుళంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణలో వారు మాట్లాడుతూ ఏప్రిల్ 5వ తేదీన శ్రీకాకుళం జిల్లాలో గల పలాస, టెక్కలి–శ్రీకాకుళం బస్ స్టేషన్ కాంప్లెక్స్‌ల నుంచి భద్రాచలం వరకు ప్రత్యేక సర్వీసులు నడపనున్న ట్లు తెలిపారు. ఈ బస్సులు ఏప్రిల్ 5వ తేదీ సా యంత్రం శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్‌లో 7 గంటలకు బయల్దేరి మరుసటి రోజు ఉదయం 6 గంటలకు భద్రాచలం చేరుకుంటాయన్నారు. తిరిగి 6వ తేదీ సాయంత్రం 5 గంటలకు భద్రాచలంలో బయల్దేరి మరుసటి రోజు ఉదయానికి శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్‌కు చేరుకుంటాయని తెలిపారు. ఈ బస్సులకు ముందస్తు రిజర్వేషన్ సౌకర్యం ఉందని పేర్కొన్నారు. అదే విధంగా ప్రముఖ పుణ్యక్షేత్రమైన రామతీర్థంలో రాములవారి కల్యాణం చూసేందుకు కూడా ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మరిన్ని వివరాలకు 9959225608, 9959225609, 9959225610, 9959225611, 08942 223188 నంబర్లను సంప్రదించాలని తెలిపారు.