చోరీ చేసి పోతారు.. | - | Sakshi
Sakshi News home page

చోరీ చేసి పోతారు..

Published Wed, Apr 16 2025 12:53 AM | Last Updated on Wed, Apr 16 2025 12:53 AM

చోరీ

చోరీ చేసి పోతారు..

చోరీల తీరే ఓ విచిత్రం..

హసన్‌, అహ్మద్‌, గఫూర్‌ల చోరీ తీరే ఓ విచిత్రం. కార్తీ నటించిన ‘ఖాకీ’లో మాదిరిగా రాయపూర్‌ నుంచి సరుకులు ఎక్కించుకుని వివిధ రాష్ట్రాల్లో అన్‌లోడ్‌ చేయడం, మళ్లీ అక్కడి నుంచి వేరే సరుకులు ఎక్కించి రాయపూర్‌ తేవడం.. సరుకుల లో డు దించి ఎత్తే మధ్య సమయంలోనే ఇళ్లకు కన్నా లు వేయడం వీరి స్పెషాలిటీ. ఈ క్రమంలో మన జిల్లాలోని కాశీబుగ్గకు కందిపప్పు లోడుతో రావ డం తిరిగి వెళ్లేటప్పుడు జీడిపప్పు తీసుకెళ్లడం, వాటితో పాటు చోరీ సొత్తు సైతం పట్టుకుపోవడం వీరికి పరిపాటి. జిల్లాలో వీరు కాశీబుగ్గ పీఎస్‌ పరిధిలో తొమ్మిది చోరీలు, ఇచ్ఛాపురంలో రెండు, మందస, సోంపేట, వజ్రపుకొత్తూరు పీఎస్‌ల్లో ఒక్కొక్కటి చొప్పున మొత్తంగా 14 చోరీల్లో రూ. 12,93,614ల విలువైన సొత్తు దోచుకెళ్లారు. వీరి నుంచి పోలీసులు రూ. 5,33,530ల విలువైన బంగారం, వెండి, నగదు, వెంట తెచ్చుకున్న లారీ ని స్వాధీనం చేసుకున్నారు. సమావేశం అనంతరం నిందితులను రిమాండ్‌కు తరలించారు. ప్రతిభ కనబర్చిన సిబ్బందిని ఎస్పీ అభినందించారు.

శ్రీకాకుళం క్రైమ్‌ : తొమ్మిది తులాల బంగారం పోయిందని ఫిర్యాదు చేశారు.. తీరా చూస్తే అవన్నీ గిల్టు. పది కిలోల వెండి పోయిందని మరొకరు ఫిర్యాదు చేశారు.. రికవరీ చేస్తే అవి మూడు కిలో లే. ఈ గిల్టు నగలను దొంగిలించింది మాత్రం ఓ అంతర్రాష్ట్ర ముఠా. 140 ఇళ్లకు కన్నాలు వేసి 32 కేసుల్లో నిందితులైన ముగ్గురు అంతర్రాష్ట్ర దొంగ లు ఈ నకిలీ నగలను చోరీ చేశారు. వీరిని పోలీసులు పట్టుకున్నారు. వీరిలో ఏ–1 నిందితుడైన నూర్‌హసన్‌(43)ది ఉత్తరాఖండ్‌ రాష్ట్రం డెహ్రడూన్‌ కాగా, మిగతా ఇద్దరు చత్తీస్‌గఢ్‌ రాష్ట్రం రాయపూర్‌కు చెందిన ఇర్ఫాన్‌ అహ్మద్‌ (32), అబ్దుల్‌ గఫూర్‌(59)లు. జిల్లాలో వీరు 14 చోట్ల చోరీలు చేయగా హిమాచల్‌ప్రదేశ్‌(07), రాజస్థాన్‌ (09), ఒడిశా (02) వంటి ఇతర రాష్ట్రాల్లో 18 కేసుల్లో నిందితు లు కావడం విశేషం. జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి ఈ మేరకు మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు.

వారి చరిత్ర చూస్తే..

ఏ–1 అయిన నూర్‌ హాసన్‌ 2001 నుంచే నేరాలు చేయడం మొదలుపెట్టాడు. ఓ కేసులో అరైస్టె డెహ్రడూన్‌ జైలుకు వెళ్లగా అక్కడ అంతర్రాష్ట్ర ముఠా నాయకుడైన షేర్‌ మహ్మద్‌ పరిచయమయ్యాడు. 18 మంది ఉన్న అతని గ్యాంగులో చేరిపోయాడు. వారితో కలసి 140 దొంగతనాలకు పాల్ప డి 32 కేసుల్లో అరైస్టె కొంతకాలం జైలులో ఉన్నాడు. రాజస్థాన్‌, జోథ్‌పూర్‌లలో తన గ్యాంగు తో కలసి నేరాలు చేయగా వారు పట్టుబడినా హస న్‌ తప్పించుకున్నాడు. ఈ క్రమంలోనే రాయపూర్‌ జైలులో పరిచయమైన ఇర్ఫాన్‌ అహ్మద్‌, అబ్దుల్‌ గఫూర్‌లను తనతో కలుపుకున్నాడు. అబ్దుల్‌ గఫూ ర్‌ సొంత లారీలో హసన్‌, ఇర్ఫాన్‌లు సరకులు ఇతర రాష్ట్రాలకు రవాణా చేసే క్రమంలో చత్తీస్‌గఢ్‌, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాల్లో ఆరు నేరాలు చేసి 2019లో పోలీసులకు పట్టుబడి 2022లో బెయిల్‌పై విడుదలయ్యారు. మళ్లీ 2003–25 కాలంలో మన రాష్ట్రంలో నేరాలకు సమాయత్తమయ్యారు.

కాశీబుగ్గ చోరీలతో మళ్లీ బయటపడి..

ఈ ఏడాది కాశీబుగ్గ పీఎస్‌ పరిధిలో జరిగిన మూ డు చోరీలకు సంబంధించి ఎస్పీ ఆదేశాలతో అడిషనల్‌ ఎస్పీ (క్రైమ్‌) పి.శ్రీనివాసరావు, డీఎస్పీ వీవీ అప్పారావు ఆధ్వర్యంలో సీఐ పి.సూర్యనారాయణ దర్యాప్తు ప్రారంభించారు. వీరికి సీసీఎస్‌ సీఐ సూ ర్యచంద్రమౌళి, సీసీఎస్‌ ఎస్‌ఐ మధుసూదనరావు, ఫింగర్‌ప్రింట్‌ ఎస్‌ఐ భరత్‌ మరికొంతమంది సహకారంతో విచారణ చేయగా ఇక్కడి దొంగలు పని కాదని గ్రహించారు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం 10 గంటలకు కాశీబుగ్గ మొగిలిపాడు వద్ద సీఐ తనిఖీలు చేస్తుండగా గొప్పిలి వైపు నుంచి సిజి04.ఎన్‌క్యూ.5609 నంబరు గల లారీపై ము గ్గు రు నిందితులు వస్తూ పట్టుబడ్డారు. వారిని విచారించగా అసలు విషయాలన్నీ బయటపడ్డాయి. త న ముఠా సభ్యులతో రాజస్థాన్‌, ఉత్తరాఖండ్‌, హర్యానా, ఉత్తరప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, ఏపీ, హిమాచల్‌ప్రదేశ్‌ రాష్ట్రాల్లో దొంగిలించిన వస్తువులను ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలో బంగారు షాపు వర్తకులకు అమ్మినట్లు ఏ–1 నిందితుడు హసన్‌ ఒప్పుకున్నారు.

వివరాలు వెల్లడిస్తున్న ఎస్పీ కేవీ మహేశ్వర రెడ్డి. చిత్రంలో రికవరీ చేసిన వస్తువులు

తప్పుడు కేసులు పెడితే.. చర్యలు తప్పవు

ప్రజలు తమ ఇళ్లల్లో బంగారం, వెండి, నగదు తక్కువ మొత్తంలో పోయినా ఎక్కువ మొత్తంలో పోయిందని ఫిర్యాదు చేసినా, గిల్టు నగలను బంగారు నగలని చెప్పినా బీఎన్‌ఎస్‌ సెక్షన్లు 212, 217 ప్రకారం కేసులు నమోదు చేస్తామని ఎస్పీ అన్నారు. ప్రజలు కరెక్టుగా చెబితే పోలీ సులు సగమే రికవరీ చేస్తారన్న విలేకరుల ప్రశ్నకు నిందితున్ని పట్టుకున్నప్పుడు అతని వ ద్ద ఎంత ఉంటే అంతే పట్టుకుంటామని, మిగిలి నది నిందితుడు బ్యాంకుల్లో, ఇతర ఫైనాన్స్‌ సంస్థల్లోను, కరిగించి అమ్మేయడం వంటివి ఉంటే వాటిని తర్వాతైనా రికవరీ చేస్తామన్నారు.

చోరీ చేసి పోతారు..1
1/2

చోరీ చేసి పోతారు..

చోరీ చేసి పోతారు..2
2/2

చోరీ చేసి పోతారు..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement