
కుప్పిలిలో నలుగురు మాత్రమే..
టీచర్ల బిడ్డ
మందస: మందస మండ లం హరిపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన కంచరాన జోషిత 597 మార్కులు తెచ్చుకుని అదరగొట్టింది. ఆమె తండ్రి మాధవరావు బి.కేశుపురంలోని ప్రాథమిక పాఠశాలలో ఎస్‌జీటీగా పనిచేస్తుండగా, తల్లి లేపాక్షి కూడా తాళభద్ర పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తున్నారు.
రైతు కుమారుడు..
పాతపట్నం: మండలంలోని రొంపివలస జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదివిన డోల మనోహర్ 593 మార్కులతో ప్రతిభ చాటాడు. విద్యార్థి స్వగ్రామం ఆర్‌ఎల్ పురం. తండ్రి డోల తేజేశ్వరరావు వ్యవసాయం చేస్తుంటారు. తల్లి డోల సావిత్రమ్మ గృహిణి.
పదో తరగతి ఫలితాల్లో జిల్లా స్థానం అమాంతం పడిపోయింది. గత ఏడాది రాష్ట్రంలోనే ద్వితీయ స్థానంలో నిలిచిన జిల్లా ఈ ఏడాది మాత్రం 14వ స్థానానికి పడిపోయింది. అయితే ప్రథమ శ్రేణి ఉత్తీర్ణతలో మాత్రం జిల్లాకు స్టేట్ ఫస్ట్ రావడం కాసింత ఊరట. గత ఏడాది 93.35 ఉత్తీర్ణత శాతంతో అదరగొట్టిన సిక్కోలు.. ఈ ఏడాది మాత్రం 82.41 శాతానికి పరిమితమైపోయింది.
కంచరాన జోషిత
శ్రీకాకుళం:
పదో తరగతి ఫలితాల్లో జిల్లా గత ఏడాదితో పోలిస్తే 12 స్థానాలు కిందకు పడిపోయింది. గత ఏడాది రాష్ట్రంలోనే రెండో స్థానంలో నిలవగా, ఈ ఏడాది 14వ స్థానానికి పడిపోయింది. జిల్లాలో 82.41 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. 28,176 మంది పరీక్షలు రాయగా, 23,219 మంది పాసయ్యారు. బాలురుపై బాలికలదే పైచేయిగా నిలిచింది. 14,287 మంది బాలురు పరీక్షలు రాయగా 11,358 మంది ఉత్తీర్ణత సాధించారు 79.50 శాతం ఉత్తీర్ణత నమోదైంది. అలాగే 13,889 మంది బాలికలు పరీక్షలు రాయగా, 11,861 మంది ఉత్తీర్ణులయ్యారు. 85.40 శాతం ఉత్తీర్ణత నమోదైంది.
రాష్ట్రంలో ఉత్తీర్ణత శాతానికి సంబంధించి జిల్లా స్థానం పడిపోయినప్పటీకీ ప్రథమశ్రేణిలో పాసయి న వారు జిల్లా నుంచే ఎక్కువ మంది ఉండటంతో రాష్ట్రంలోనే ప్రథమంగా నిలిచింది. ఉత్తీర్ణత సాధించిన వారిలో 19,114 మంది ప్రథమ శ్రేణిలోనూ, 2885 మంది ద్వితీయ శ్రేణిలోనూ, 1128 మంది తృతీయ శ్రేణిలోనూ ఉత్తీర్ణులయ్యారు. మందస మండలం హరిపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన కె. జోషిత అనే విద్యార్థి 597 మార్కులతో జిల్లాలోనే ప్రథమంగా నిలిచింది.
యాజమాన్యాల వారీగా..
యాజమాన్యాలు వారీగా పరిశీలిస్తే ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ పాఠశాలలు 96.18 శాతంతో ప్రథ మంగా నిలిచాయి. ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ఈ పాఠశాలల్లో ఫలితాలు వచ్చాయి. ప్రైవేటు పాఠశాలల్లో 95.77 శాతం ఉత్తీర్ణులయ్యారు. జ్యోతిబా పూలే పాఠశాలల్లో 94.33 శాతం, గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో 83.22 శాతం, కేజీబీవీల్లో 89.46 శాతం, మున్సిపల్ పాఠశాలల్లో 73.53 శాతం ఉత్తీర్ణులయ్యారు. మోడల్ స్కూళ్లలో 89.60 శాతం, సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో 90.48 శాతం, ట్రైబెల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో 87.32 శాతం పాసయ్యారు. ప్రభుత్వ పాఠశాలల్లో 70.77 శాతం, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో 76.22 శాతం ఉత్తీర్ణత పొందారు.
597
ఫలితాలన్నింటినీ బేరీజు వేసుకుంటే జిల్లా పరిషత్, ప్రభుత్వ, మున్సిపల్, కేజీబీవీల్లో ఉత్తీర్ణత బాగా తగ్గిందనే చెప్పాలి. అలాగే రాష్ట్రవ్యాప్తంగా కాపీయింగ్‌తో సంచలనమైన కుప్పిలి పాఠశాలలో కేవలం నలుగురు విద్యార్థులు మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. మొత్తం 53 మంది పరీక్షలు రాయ గా 49 మంది ఉత్తీర్ణులు కాలేకపోయారు.

కుప్పిలిలో నలుగురు మాత్రమే..

కుప్పిలిలో నలుగురు మాత్రమే..

కుప్పిలిలో నలుగురు మాత్రమే..

కుప్పిలిలో నలుగురు మాత్రమే..

కుప్పిలిలో నలుగురు మాత్రమే..