సాక్షి, నల్గొండ: కోదాడ షాడో ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్న కోదాడ ఎంపీపీ, ఆమెను ప్రోత్సహిస్తున్న ఎమ్మెల్యే అరాచకాలను తట్టుకోలేక విధిలేని పరిస్థితుల్లో బీఆర్‌ఎస్‌ను వీడుతున్నామని కోదాడ మాజీ మార్కెట్ చైర్‌పర్సన్ బుర్రా సుధారాణి, పలువురు సర్పంచ్‌లు ప్రకటించారు. ఆదివారం కోదాడలో ఆమె నివాసంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు.
కోదాడలో మట్టి వ్యాపారుల నుంచి నెలకు రూ.8లక్షల నుంచి రూ.10 లక్షలు వసూలు చేస్తున్న షాడో ఎమ్మెల్యేతో పట్టణంలో వందల మంది ఇళ్లను కట్టుకోలేక నెలల తరబడి ఇబ్బందులు పడ్డారన్నారు. వీరి అక్రమాలతో ప్రజలు తమను నిలదీస్తున్నారని, దీనిని తట్టుకోలేక తామే బీఆర్‌ఎస్‌కు రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నామని తెలిపారు. సమావేశంలో అనంతగిరి ఎంపీపీ చుండూరు వెంకటేశ్వరరావు, లక్కారం, బొజ్జగూడెం సర్పంచ్‌లు భూపతి, వెంకటేశ్వర్లు, మాజీ సింగిల్ విండో చైర్మన్ బుర్రా నర్సింహారెడ్డి, కత్రం నాగేందర్‌రెడ్డి, గునుకుల స్వరూప పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment