అక్రమ రవాణాను అడ్డుకోవాలి
కోదాడ రూరల్: రాష్ట్రంలోకి అక్రమంగా సరుకు రవాణా కాకుండా పోలీసులు అడ్డుకోవాలని ఎస్పీ నరసింహ ఆదేశించారు. కోదాడ మండలం రామాపురం క్రాస్‌రోడ్డులో జాతీయ రహదారిపై ఉన్న అంతరాష్ట్ర సరిహద్దు చెక్‌పోస్టును బుధవారం రాత్రి ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. చెక్‌పోస్టు వద్ద విధులు నిర్వర్తిస్తున్న సిబ్బంది వివరాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశాకే రాష్ట్రంలోకి అనుమతించాలన్నారు. అనంతరం రూరల్ పోలీస్ స్టేషన్, షీటీమ్ పోలీస్ స్టేషన్లను తనిఖీ చేశారు. స్టేషన్‌కు వచచే ఫిర్యాదుదారులతో మర్యాదగా ప్రవర్తించాలని సూచించారు. ఆయ న వెంట కోదాడ డీఎస్పీ శ్రీధర్‌రెడ్డి, కోదాడ రూరల్ సీఐ రజితారెడ్డి, రూరల్ ఎస్‌ఐ అనిల్‌రెడ్డి ఉన్నారు.
హోలీ వేడుక ప్రశాంతంగా జరుపుకోవాలి
సూర్యాపేట టౌన్: హోలీ పండుగను ప్రజలంతా ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని ఎస్పీ నర్సింహ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ప్రజలందరికీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. హోలీ జరుపుకునేవారు జాగ్రత్తలు పాటించాలని కోరారు. యువత ద్విచక్ర వాహనాలపై వేగంగా వెళ్తూ ఇతరులకు ఇబ్బందులు కలిగించవద్దని సూచించారు. సంప్రదాయ రంగులు ఉపయోగించడం ఆరోగ్యకరమని తెలిపారు. నీటి ప్రవాహం, లోతైన నీటిలోకి వెళ్లి ప్రమాదాల బారిన పడొద్దని, ప్రార్థనా మందిరాల వద్ద రంగులు చల్లవద్దని కోరారు. పండుగ వేళ ఎవరైనా గొడవలు పడినా, అసత్య ప్రచారం చేసినా, ఇతరుల పట్ల అసభ్యంగా ప్రవర్తించినా, మహిళలను వేధింపులకు గురిచేసినా కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. పిల్లల పట్ల తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.
సీఎంఆర్ బకాయి రికవరీ చేయండి
ఫ అదనపు కలెక్టర్ రాంబాబు
భానుపురి (సూర్యాపేట): జిల్లాలో పెండింగ్‌లో ఉన్న సీఎంఆర్ బకాయి పూర్తిగా రికవరీ చేయాలని అదనపు కలెక్టర్ పి.రాంబాబు ఆదేశించారు. బుధవారం సూర్యాపేట కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో పౌర సరఫరాల శాఖ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అధికారులు రోజూ క్షేత్రస్థాయిలో పరిశీలిస్తూ మిల్లుల వారీగా ఎంత బకాయి పంపిస్తున్నారో నివేదిక సమర్పించాలని సూచించారు. సమావేశంలో డీఎస్‌ఓ రాజేశ్వర్, డీఎం ప్రసాద్, శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.
ఫ ఎస్పీ నరసింహ
Comments
Please login to add a commentAdd a comment