‘ఎల్‌ఆర్‌ఎస్’కు భారీగా దరఖాస్తులు
సూర్యాపేట: ఎల్‌ఆర్‌ఎస్ ద్వారా ప్లాట్ల క్రమబద్ధీకరణ దరఖాస్తులు భారీగా వస్తున్నాయని కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ తెలిపారు. బుధవారం సూర్యాపేట మున్సిపల్ కార్యాలయంలో ఎల్‌ఆర్‌ఎస్‌పై ఏర్పాటుచేసిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. ఎల్‌ఆర్‌ఎస్ క్రమబద్ధీకరణపై ప్రభుత్వం కల్పించిన 25 శాతం రిబేటును సద్వినియోగం చేసుకోవాలన్నారు. సూర్యాపేట మున్సిపాలిటీలో ఇప్పటి వరకు 961 మంది ఫీజు చెల్లింపులు పూర్తి చేశారని, ఎల్‌ఆర్‌ఎస్ కింద రూ.4.88 కోట్ల రుసుము వసూలు అయిందని, బుధవారం ఒక్కరోజే రూ.19.66లక్షల రుసుము వసూలైందన్నారు. బఫర్, ఎఫ్‌టీఎల్, చెరువులు, కుంటలు వంటి నిషేధిత జాబితాలోని ప్రాంతాలను మినహాయిస్తే, ఇతర ప్రాంతాల్లోని ప్లాట్లకు ఆన్‌లైన్‌లో సులభంగా అనుమతి లభిస్తుందన్నారు. ఎల్‌ఆర్‌ఎస్‌కు అర్హత లేని స్థలాలపై చెల్లించిన ఫీజు 90 శాతం రిఫండ్ అవుతుందని 10శాతం ప్రాసెసింగ్ చార్జెస్ కింద తీసుకుంటారన్నారు. 2020 ఆగస్టు 26 నాటికి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ కలిగి గతంలో ఎల్‌ఆర్‌ఎస్‌కు రూ.వెయ్యి చెల్లించిన వారు వెంటనే ఎల్‌ఆర్‌ఎస్ లాగిన్ ద్వారా ఫీజు చెల్లించి ఫీజులు 25 శాతం రిబేటు పొందాలన్నారు. సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ పి.రాంబాబు, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, సబ్ రిజిస్టార్ అంబేద్కర్, టీపీఓ సోమయ్య, ఎస్.శశికుమార్, ఆర్‌ఓ కళ్యాణి, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
ఫ కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్
Comments
Please login to add a commentAdd a comment