ఉద్యోగం.. ప్రజలకు సేవ చేసేలా ఉండాలి
భానుపురి (సూర్యాపేట) : ఎంచుకున్న ఉద్యోగం ప్రజలకు సేవ చేసేలా ఉండాలని కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ సూచించారు. ప్రభుత్వం ఇటీవల వెల్లడించిన గ్రూప్ – 2 ఫలితాల్లో జిల్లా నుంచి ప్రతిభ కనబర్చి ఎంపికై న నలుగురు అభ్యర్థులను కలెక్టర్ అభినందించారు. ఈ సందర్భంగా ఆయన వారితో మాట్లాడారు. ఉద్యోగం ఆశయాలకు అనుగుణంగా ఉండాలన్నారు. ఎక్కడ నుంచి వచ్చామని కాకుండా ఏమి చేయాలనుకున్నామనేది ముఖ్య మని పేర్కొన్నారు. సూర్యాపేట జిల్లా పెన్‌పహాడ్ మండలం మహ్మదాపురం గ్రామం నుంచి గ్రూప్– 2 పరీక్షల్లో నాలుగో ర్యాంకు సాధించిన శ్రీరామ్ మధు, నూతనకల్ మండలం చిల్పకుంట్ల గ్రామం నుంచి 63వ ర్యాంకు సాధించిన మద్దిడి శ్యాంసుందర్ రెడ్డి, కోదాడ మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన 293వ ర్యాంకు సాధించిన మాణిక్యం వేణు, మహ్మదాపురం గ్రామం నుంచి 326వ ర్యాంకు సాధించిన శ్రీరామ్ నవీన్ లతో వారి భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. ఈ నలుగురు రైతు కుటుంబాలను నుంచి రావడం చాలా సంతోషకరంగా ఉందని, తమ తల్లిదండ్రుల కోర్కెలను నెరవేర్చిన వారయ్యారని కలెక్టర్ వారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ పి. రాంబాబు, డీఆర్‌డీఓ వి.వి. అప్పారావు కలెక్టరేట్ ఏఓ సుదర్శన్ రెడ్డి పాల్గొన్నారు.
ఫ కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్
Comments
Please login to add a commentAdd a comment