ఐఈఆర్పీలను రెగ్యులరైజ్ చేయాలి
నాగారం: రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగులకు విద్యాబోధన చేస్తున్న ఐఈఆర్పీ(ఇన్‌క్లూసివ్ ఎడ్యుకేషన్ రిసోర్స్ పర్సన్)లను సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా రెగ్యులరైజ్ చేయాలని ఐఈఆర్పీల సంఘం జిల్లా అధ్యక్షుడు పెండెం శ్రీనివాస్ కోరారు. శుక్రవారం నాగారం మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 2023–24 లెక్కల ప్రకారం 81వేల మంది దివ్యాంగ పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లో నమోదై ఉన్నారని, వీరికి 790 మంది ఉపాధ్యాయులు గత 19 సంవత్సరాలుగా కాంట్రాక్టు పద్ధతిలో విద్యాబోధన చేస్తున్నారని తెలిపారు. ఈ సమవేశంలో ఐఈఆర్పీలు పోరెడ్డి కవిత, మైనేని మురళీధర్‌రావు, రంగారావు, బాషా, ఉపేందర్ పాల్గొన్నారు.
మట్టపల్లిలో నిత్యారాధనలు
మఠంపల్లి: మట్టపల్లి క్షేత్రంలో శుక్రవారం నిత్యారాధనలు కొనసాగాయి. ఈ సందర్భంగా శ్రీరాజ్యలక్ష్మీ చెంచులక్ష్మీ సమేత శ్రీలక్ష్మీనరసింహస్వామి వార్లను నూతన పట్టువస్త్రాలతో వధూవరులుగా అలంకరించి ఎదుర్కోలు మహోత్సవం నిర్వహించారు. అనంతరం వేదమంత్రాల నడుమ నిత్యకల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. శ్రీస్వామివార్ల ఆలయ తిరుమాడ వీధుల్లో గరుడ వాహనంపై ఊరేగించారు. నీరాజన మంత్ర పుష్పాలతో మహానివేదన గావించి భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు విజయ్‌కుమార్, మట్టపల్లిరావు, ఈఓ నవీన్‌కుమార్, అర్చకులు అద్దేపల్లి లక్ష్మణాచార్యులు, పద్మనాభాచార్యులు, బదరీ నారాయణాచార్యులు, ఫణిభూషణ మంగాచార్యులు, లక్ష్మీనరసింహమూర్తి, ఆంజనేయాచార్యులు, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శేషగిరిరావు, భక్తులు పాల్గొన్నారు.
మూసీ కాల్వలకు
నీటి నిలిపివేత
కేతేపల్లి: మూసీ ప్రాజెక్టు కుడి, ఎడమ కాల్వలకు శుక్రవారం అధికారులు నీటి విడుదలను నిలిపివేశారు. యాసంగిలో పంటల సాగుకు విడతల వారీగా నీటిని విడుదల చేస్తున్నారు. అందులోభాగంగా మూడవ విడతగా ఫిబ్రవరి 20వ తేదీ నుంచి ఈనెల 14వ తేదీ వరకు 22 రోజుల పాటు నీటిని విడుదల చేశారు. గడువు సమయం ముగియడంతో శుక్రవారం కుడి, ఎడమ కాల్వలకు నీటిరి నిలిపివేశారు. ఐదు రోజుల విరామం తర్వాత ఈ నెల 20 తేదీ నుంచి నాలుగో విడత నీటిని విడుదల చేయనున్నారు. 645 అడుగుల గరిష్ట నీటమట్టం గల మూసీ ప్రాజెక్టులో ప్రస్తుతం 630.50 (1.46 టీఎంసీలు) అడుగుల మేర నీరు నిల్వ ఉందని అధికారులు తెలిపారు.
డ్రగ్స్ అనర్థాలపై
వినూత్న ప్రచారం
వేములపల్లి: యువత డ్రగ్స్‌కు బానిసై తమ భవిష్యత్‌ను నాశనం చేసుకోవద్దని మద్దిరాల మండలం గోరెంట్ల ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు రాచకొండ ప్రభాకర్ శుక్రవారం ఆమనగల్లు జాతరలో యువతకు కరపత్రాలు పంపిణీ చేస్తూ వినూత్న ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత మద్యం, డ్రగ్స్ బారిన పడడం వల్ల పెడదారి పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. యువత డ్రగ్స్ జోలికి వెళ్లకుండా మంచి పౌరులుగా ఎదగాలన్నారు.
యాదగిరి క్షేత్రంలో
హోలీ సేవ
యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శుక్రవారం హోలీ సేవ ఘనంగా నిర్వహించారు. సాయంత్రం శ్రీస్వామి, అమ్మవార్లను ప్రత్యేకంగా తీర్చిదిద్ది ఆలయ తిరు, మాడ వీధుల్లో ఊరేగించారు. అనంతరం పడమటి రాజగోపురం ఎదుట గల వేంచేపు మండపంలో అధిష్టింపజేసి ప్రత్యేక పూజలు చేసి, పారాయణం పఠించారు. ప్రధానార్చాకులు హోలీ సేవ విశిష్టతను భక్తులకు వివరించారు. అనంతరం ఉత్సవ మూర్తులపై రంగులు చల్లారు. ఆ తరువాత భక్తులు పరస్పరం రంగులు చల్లుకున్నారు. ఈ వేడుకలో ఆచార్యులు, అధికారులు పాల్గొన్నారు.
ఐఈఆర్పీలను రెగ్యులరైజ్ చేయాలి
Comments
Please login to add a commentAdd a comment