విద్యా ప్రమాణాలు మెరుగుపడతాయి
ఫ అదనపు కలెక్టర్ రాంబాబు
చివ్వెంల: కృతిమ మేధ (ఏఐ) బోధనతో విద్యాప్రమాణాలు మెరుగుపడతాయని జిల్లా అదనపు కలెక్టర్ పి.రాంబాబు అన్నారు. శనివారం చివ్వెంల మండలం వట్టిఖమ్మంపహాడ్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలోని ప్రాథమిక పాఠశాలలో కృతిమ మేధ (ఏఐ) బోధన ల్యాబ్‌ను ప్రారంభించారు. అనంతరం ఏఐ బోధన పద్ధతిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘సీ’ గ్రేడ్ విద్యార్థులను ‘ఏ, బీ’ గ్రేడ్‌లకు మార్చేలా బోధించాలన్నారు. నాలుగవ తరగతి విద్యార్థులతో తెలుగు, ఇంగ్లిష్ పాఠాలు చదివించి సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో డీఈఓ అశోక్, తహసీల్దార్ కృష్ణయ్య, ఎంఈఓ రమణ, జెడ్పీహెచ్‌ఎస్ హెచ్‌ఎం గోలి శ్రీనివాస్, పీఎస్ హెచ్‌ఎం దయామణి, ఉపాధ్యాయులు పూర్ణ చంద్రశేఖర్, సీహెచ్.వెంకటేశ్వర్లు, సైదులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment