దేశానికి దిక్సూచి తెలంగాణ రాష్ట్రం
తుంగతుర్తి: భారతదేశానికి తెలంగాణ రాష్ట్రం దిక్సూచిగా మారుతుందని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు అన్నారు. ఆదివారం తుంగతుర్తి మండల కేంద్రంలో జరగనున్న కాంగ్రెస్‌పార్టీ కృతజ్ఞత సభ ఏర్పాట్లను శనివారం ఆయన పరిశీలించి మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణ, బీసీ కులగణన చేపట్టినందుకు కృతజ్ఞతా పూర్వకంగా సభను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. నియోజవర్గంలో అభివృద్ధి పనులకు నిధులు కేటాయించాలని ఆదివారం జరిగే సభలో మంత్రులను కోరతానన్నారు. స్పీకర్‌ను అవమానించేలా సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి మాట్లాడటం సమంజసం కాదన్నారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఫోన్‌ట్యాపింగ్ చేస్తున్నారని ఆరోపించారు. పీసీసీ ఆదేశాల మేరకు కేసీఆర్, జగదీశ్‌రెడ్డిల దిష్టిబొమ్మలను ఆదివారం అన్ని జిల్లా, మండల కేంద్రాల్లో దహనం చేయనున్నట్లు తెలిపారు. ఈ సభకు మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి, ఎంపీలు కిరణ్‌కుమార్‌రెడ్డి, రఘువీర్‌రెడ్డిలు, కాంగ్రెస్‌పార్టీ జిల్లా అధ్యక్షుడు హాజరవుతారని తెలిపారు. అనంతరం డీఎస్పీ రవితో కలిసి సభ ఏర్పాట్లను పరిశీలించారు. అలాగే నియోజకవర్గ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రైతు కమిషన్ సభ్యుడు, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు చెవిటి వెంకన్న యాదవ్, తుంగతుర్తి మార్కెట్ కమిటీ చెర్మన్ తీగల గిరిధర్‌రెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ గుడిపాటి సైదులు, మార్కెట్ కమిటీ వైస్‌చైర్మన్ చింతకుంట్ల వెంకన్న, ఆయా మండల పార్టీల అధ్యక్షుడు దొంగరి గోవర్ధన్, ఎల్సోజు నరేష్, అభిషేక్‌రెడ్డి అవిలమల్లు, తోడుసు లింగయ్య, నాయకులు రాంబాబు, నాగరాజు తదితరులుపాల్గొన్నారు.
ఫ తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు
Comments
Please login to add a commentAdd a comment