వినయ్‌భానురెడ్డి యాదిలో..
బొమ్మలరామారం : మండల కేంద్రానికి చెందిన దివంగత లెఫ్టినెంట్ కల్నల్ ఉప్పల వినయ్‌భానురెడ్డి ద్వితీయ వర్ధంతిని ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బొమ్మలరామారంలోని గుడిబావి చౌరస్తా వద్ద ఉన్న వినయ్ భానురెడ్డి విగ్రహానికి కుటుంబ సభ్యులు, నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో వినయ్ భానురెడ్డి సతీమణి స్పందనారెడ్డి, తల్లిదండ్రులు ఉప్పల నర్సింహారెడ్డి, విజయలక్ష్మి, దంతపల్లి వంశీరెడ్డి పాల్గొన్నారు.
ఒంటిపూట బడుల
వేళల్లో మార్పు
సూర్యాపేట టౌన్: ఒంటిపూట బడుల వేళల్లో మార్పులు చేస్తూ పాఠశాల విద్యాశాఖ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఉదయం 8 గంటలకు మొదటి గంట, 8.05 గంటలకు రెండో గంటతో పాటు ప్రార్థన చేసి 8.15 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు తరగతులు నిర్వహించాలని మొదట ఆదేశాలు ఇచ్చింది. ఈ వేళల్లో స్వల్ప మార్పులు చేసింది. ఉదయం 7.45కు మొదటి గంట, 7.50కి రెండో గంటతో పాటు ప్రార్థన చేయాల్సి ఉంటుంది. 8 నుంచి మధ్యాహ్నం 12.30గంటల వరకు తరగతులు నిర్వహించిన తర్వాత విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందజేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఎంఈఓలు, ప్రధానోపాధ్యాయులు సవరించిన వేళలను అమలు చేయాలని డీఈఓ అశోక్ ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment