భగత్‌సింగ్ స్ఫూర్తితో ఉద్యమించాలి
భానుపురి (సూర్యాపేట): దేశ స్వాతంత్య్రం కోసం ప్రాణాలర్పించిన భగత్‌సింగ్ స్ఫూర్తితో ప్రజా సమస్యలపై ఉద్యమించాలని ప్రగతిశీల యువజన సంఘం(పీవైఎల్) రాష్ట్ర కోశాధికారి ధరావత్ రవి పిలుపునిచ్చారు. ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని చండ్ర పుల్లారెడ్డి విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సామ్రాజ్య వాదానికి వ్యతిరేకంగా నిరంతరం పోరాడిన భగత్‌సింగ్, రాజగురు, సుఖదేవుల వర్ధంతి సభలను ఈనెల 23 నుంచి గ్రామగ్రామాన నిర్వహించాలని కోరారు. ఈ సమావేశంలో ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు నల్లగొండ నాగయ్య, ఉపాధ్యక్షుడు వీరబోయిన రమేష్, కోశాధికారి బండి రవి, సభ్యులు గిరి, అశోక్, గణేష్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment