ఆర్టీసీ సూర్యాపేట డిపో మేనేజర్ బదిలీ
● కొత్త మేనేజర్‌గా లక్ష్మీనారాయణ
భానుపురి (సూర్యాపేట): సూర్యాపేట ఆర్టీసీ డిపో మేనేజర్ సురేందర్ ముషీరాబాద్ డిపో–2కు బదిలీ అయ్యారు. ఈయన స్థానంలోకి భూపాలపల్లి డిపో మేనేజర్‌గా పనిచేస్తున్న జి.లక్ష్మీనారాయణ బదిలీపై వచ్చారు. ఈయన సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా డిపో పరిధిలో బస్సులు నడుపుపామన్నారు.
పొట్టి శ్రీరాములు
పేరు కొనసాగించాలి
సూర్యాపేట: తెలుగు విశ్వవిద్యాలయానికి పొట్టి శ్రీరాములు పేరు యథావిధిగా కొనసాగించాలని ఆర్యవైశ్య యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు బొమ్మిడి అశోక్ కోరారు. సోమవారం సూర్యాపేటలో ఏర్పాటు చేసిన విలేకరు ల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలుగు విశ్వవిద్యాలయాన్ని సురవరం ప్రతాపరెడ్డి విశ్వవిద్యాలయంగా పేరు మార్చడాన్ని ఖండిస్తున్నామని పేర్కొన్నారు. సమావేశంలో ఆర్యవైశ్య మహాసభ జిల్లా ఉపాధ్యక్షులు నరేంద్రుని విద్యాసాగర్‌రావు, బచ్చు పురుషోత్తం, నాయకులు బజ్జూరి శ్రీనివాస్, శీలా శంకర్, ఓరుగంటి సంతోష్, బిక్కుమల్ల సంతోష్, యామా సంతోష్, పాలవరపు నరసింహారావు, బెలిదె నాగేందర్, ఇమ్మడి సందీప్ పాల్గొన్నారు.
గోదావరి జలాలు ఏవీ?
అర్వపల్లి : యాసంగి సీజన్‌కుగాను జిల్లాకు వారబందీ విధానంలో చివరి విడతగా సోమవారం నుంచి గోదావరి జలాలు విడుదల చేసామని నీటి పారుదల శాఖ అధికారులు ప్రటించినా పునరుద్ధరించలేదు. రాత్రి వరకు కూడా నీటి విడుదల జరగలేదు. దీంతో రోజంతా గోదావరి జలాల కోసం అన్నదాతలు ఎదురు చూశారు. మంగళవారం కూడా నీళ్లు వచ్చే అవకాశం లేదని సమాచారం. నీటి పారుదలశాఖ అధికారులు ప్రకటించినా నీటిని ఎందుకు విడుదల చేయడం లేదని రైతులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే వరిపంటలు నీళ్లు చాలక ఎండిపోతున్నాయని, వెంటనే నీటిని పునరుద్ధరించాలని రైతులు కోరుతున్నారు.
హామీలు అమలు చేయాలి
భానుపురి (సూర్యాపేట): ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయడంతోపాటు ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున్‌రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం పార్టీ వన్ టౌన్, టూటౌన్, త్రీటౌన్ కమిటీల ఆధ్వర్యంలో ఇటీవల పట్టణంలో నిర్వహించిన సర్వేలో తాము గుర్తించిన సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ స్థానిక మున్సిపల్ కార్యాలయం ఎదుట చేపట్టిన నిరాహార దీక్షను ఆయ న ప్రారంభించి మాట్లాడారు. దీక్షకు ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు యాతాకుల రాజయ్య మాదిగ, జిల్లా నాయకులు ఎర్ర వీరస్వామిమాదిగ సంఘీభావం ప్రకటించారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్‌కు వినతిపత్రం అందించారు. ఈ దీక్షలో పార్టీ జిల్లా నాయకులు కోట గోపి, మట్టిపల్లి సైదులు, ఎల్గూరి గోవింద్, శేఖర్, మద్దెల జ్యోతి, రవి, వన్‌టౌన్ కార్యదర్శి సాయికుమార్, టూటౌన్ కార్యదర్శి నాగమణి, త్రీటౌన్ కార్యదర్శి యాదగిరి, రూరల్ మండల కార్యదర్శి కృష్ణారెడ్డి, సైదమ్మ, మందడి రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మట్టపల్లిలో నిత్యకల్యాణం
మఠంపల్లి: మట్టపల్లి క్షేత్రంలో సోమవారం శ్రీరాజ్యలక్ష్మీ చెంచులక్ష్మీ సమేత శ్రీలక్ష్మీనరసింహస్వామి నిత్యకల్యాణాన్ని అర్చకులు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించారు. క్షేత్రంలోని శివాలయంలో మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, విజయ్‌కుమార్, ఈఓ నవీన్‌కుమార్ అర్చకులు పాల్గొన్నారు.
ఆర్టీసీ సూర్యాపేట డిపో మేనేజర్ బదిలీ
ఆర్టీసీ సూర్యాపేట డిపో మేనేజర్ బదిలీ
ఆర్టీసీ సూర్యాపేట డిపో మేనేజర్ బదిలీ
Comments
Please login to add a commentAdd a comment