హామీలు మరిచిన కాంగ్రెస్ ప్రభుత్వం
సూర్యాపేట టౌన్ : కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు మరిచి పాలన సాగిస్తోందని బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, తుంగతుర్తి, కోదాడ మాజీ ఎమ్మెల్యేలు గాదరి కిషోర్‌కుమార్, బొల్లం మల్లయ్య యాదవ్ విమర్శించారు. సోమవారం సూర్యాపేటలోని ఆ పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. శాసనసభలో ముఖ్యమంత్రి ఉపయోగించే పదజాలాన్ని ఖండించని మేధావులు రాష్ట్రంలో ఉన్నారంటే దిగజారుడు రాజకీయాలు కనిపిస్తున్నాయన్నారు. స్పీకర్‌ను జగదీష్‌రెడ్డి అవమానించి మాట్లాడినట్లు ఏ వీడియోల్లో లేదన్నారు. పదే పదే దళిత స్పీకర్ అంటూ కాంగ్రెసోళ్లే అవమానిస్తున్నారని పేర్కొన్నారు. తుంగతుర్తి నియోజకవర్గంలో వేల ఎకరాల్లో వరిపొలాలు ఎండిపోతున్నా పట్టించుకోవడం లేదన్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో ధర్నాలు, రాస్తారోకోలు చేయవద్దనడం దారుణమన్నారు. నిరసన తెలిపే హక్కు అందరికీ ఉంటుందన్నారు. ఈ నెల 20న సూర్యాపేటలోని బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో జరిగే ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశానికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్, మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు హాజరవుతారని తెలిపారు. ఏప్రిల్ 27న జరిగే బీఆర్‌ఎస్ ఆవిర్భావ బహిరంగసభ విజయవంతంపై ఈ సమావేశంలో చర్చిస్తామన్నారు. ఈ సమావేశంలో నాయకులు నిమ్మల శ్రీనివాస్‌గౌడ్, వై వెంకటేశ్వర్లు, పెరుమాళ్ల అన్నపూర్ణ, మాజీ జెడ్పీటీసీ దావుల వీరప్రసాద్ యాదవ్, బండారు రాజా, బూరబాల సైదులుగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్
Comments
Please login to add a commentAdd a comment