సోషల్ మీడియాపై ప్రత్యేక నిఘా
సూర్యాపేట టౌన్: సోషల్ మీడియాపై పోలీస్ శాఖ ప్రత్యేక నిఘా పెట్టిందని ఎస్పీ నరసింహ అన్నారు. శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో వివిధ విభాగాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సైబర్ సెక్యూరిటీ సెల్, ఐటీ సెల్, కమాండర్ కంట్రోల్ సెంటర్, సోషల్ మీడియా మానిటరింగ్ యూ నిట్లను పరిశీలించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ కమాండ్ కంట్రోల్ సెంటర్, ఐటీ, సైబర్ సెక్యూరిటీ, మానిటరింగ్ యూనిట్లను బలోపేతం చేశామన్నారు. సామాజిక మాధ్యమాలపై జిల్లా పోలీస్ శాఖ ప్రత్యేక దృష్టి సారిస్తుందన్నారు. చాలా మంది యువత, ప్రజలు అవగాహన లేకుండా సోషల్ మీడియాలో అనవసరంగా అసభ్యకర పోస్టులు, ఇతరులను కించపరిచేలా సమాచారం పంపిస్తున్నారని, ఇలాంటివి చట్టరీత్యా నేరమన్నారు. సోషల్ మీడియా పోస్టుల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, తప్పుడు పోస్టులు పెడితే ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయనే అంశాలపై ప్రతిఒక్క రూ కలిగి ఉండాలన్నారు. ఆయన వెంట ఏఆర్‌ఎస్పీ జనార్దన్‌రెడ్డి, ఆర్‌ఐ నర్సింహ, సిబ్బంది ఉన్నారు.
ఫ ఎస్పీ నరసింహ
Comments
Please login to add a commentAdd a comment