రూ.230.84 కోట్లకు చేరుకున్న డిపాజిట్లు
భూదాన్‌పోచంపల్లి: పోచంపల్లి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ డిపాజిట్లు రూ.230.84 కోట్లకు చేరుకొందని బ్యాంక్ చైర్మన్ తడక రమేశ్ అన్నారు. ఆదివారం పోచంపల్లి పట్టణ కేంద్రంలోని చేనేత టై అండ్ డై భవనంలో బ్యాంక్ 50వ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా 2025–26 ఆర్థిక సంవత్సరం అంచనా బడ్జెట్‌ను ఆమోదించారు. అలాగే బ్యాంకు ఆర్థిక పరిస్థితి, వాయిదా మీరిన బాకీలపై నివేదిక చదివి వినిపించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. బ్యాంక్ ద్వారా ఇప్పటి వరకు రైతులు, వ్యాపారులు, ప్రజలకు రూ.164.08 కోట్ల మేర రుణాలు ఇచ్చామని పేర్కొన్నారు. ప్రస్తుతం 10 బ్రాంచ్‌ల ద్వారా బ్యాంక్ సేవలందిస్తున్నామని, త్వరలో రంగారెడ్డి జిల్లా తుర్కయంజాల్, ఇబ్రహీంపట్నం, ఆమనగల్లు, కల్వకుర్తిలో నూతన బ్రాంచ్‌లను ప్రారంభిస్తున్నామని పేర్కొన్నారు. అదేవిధంగా మరో 8 బ్రాంచ్‌లకు ఆర్‌బీఐ అనుమతులు ఇచ్చిందని తెలిపారు. ఖాతాదారులకు నాణ్యమైన సేవలందిస్తున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో బ్యాంక్ సీఈఓ సీత శ్రీనివాస్, వైస్ చైర్మన్ భారత రాజేంద్రప్రసాద్, డైరెక్టర్లు కర్నాటి వెంకటబాలసుబ్రహ్మణ్యం, ఏలే హరిశంకర్, సూరెపల్లి రమేశ్, రాపోలు వేణు, గుండు కావ్య, కర్నాటి భార్గవి, కొండమడుగు ఎల్లస్వామి, బిట్టు భాస్కర్, మక్తాల నర్సింహ, సీత హరినాథ్, సీత సత్యనారాయణ, రంగయ్య, కుడికాల బాల్‌నర్సింహ, సిద్దిరాములు, కొండ శంకరయ్య, భోగ విష్ణు, బండి యాదగిరి, సీనియర్ మేనేజర్ రాచకొండ మధుసూదన్, మేనేజర్ రచ్చ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
పోచంపల్లి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ తడక రమేశ్
Comments
Please login to add a commentAdd a comment