క్రికెట్ బెట్టింగ్‌ల జోలికి వెళ్లొద్దు : ఎస్పీ
సూర్యాపేట టౌన్: ఐపీఎల్ క్రికెట్ సీజన్ ప్రారంభమైనందున యువత బెట్టింగ్‌లు వేసి జీవితాలను నాశనం చేసుకోవద్దని జిల్లా ఎస్పీ కె.నరసింహ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎవరూ కూడా క్రికెట్ బెట్టింగ్‌లు పెట్టవద్దని పేర్కొన్నారు. బెట్టింగ్‌లు పెట్టి నష్టోయి ఆత్మహత్యలు చేసుకుని కుటుంబాలను రోడ్డు పాలు చేయొద్దని పేర్కొన్నారు. బెట్టింగ్ ముఠాల నుంచి బెదిరింపులు వస్తాయని, జీవితం విచ్ఛిన్నం అవుతుందని తెలిపారు. ఇంటర్మీడియట్ పరీక్షలు పూర్తి అయ్యాయని, విద్యార్థులు సెలవుల దృష్ట్యా ఖాళీగా ఉంటారని, ఒక్కపూట బడులతో మిగతా చిన్నారులు కూడా ఇళ్ల వద్ద ఉంటారని వారి పట్ల తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని పేర్కొన్నారు. అవసరానికి మించి విద్యార్థులకు డబ్బులు సమకూర్చవద్దని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. ఈ మ్యాచులు ప్రారంభం అయ్యాక మీ పిల్లల ప్రవర్తనలో ఏదైనా మార్పులు కనబడితే వెంటనే కౌన్సిలింగ్ ఇవ్వాలని కోరారు.
ఎస్సారెస్పీ 11ఆర్
మైనర్‌కు మరమ్మతులు
అర్వపల్లి: జాజిరెడ్డిగూడెం మండలం రామన్నగూడెం శివారు కుడితిగుట్ట వద్ద గండి పడిన ఎస్సారెస్పీ 11ఆర్ మైనర్ కాలువకు ఆదివారం నీటిపారుదల శాఖ అధికారులు మరమ్మతులు చేయించారు. ఎస్సారెస్పీ 11ఆర్ మైనర్‌కు గండి శీర్షికన ఆదివారం సాక్షిలో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. నీటిపారుదల శాఖ ఏఈ హరిస్వరూప్ వెంటనే గండిపడిన చోటకు వెళ్లి పరిశీలించారు. మట్టిపోయించి తాత్కాలిక మరమ్మతులు చేయించారు. దీంతో నీళ్లు వృథాగా పోవడం ఆగాయి. ఇందుకు కృషిచేసిన ‘సాక్షి’కి, అధికారులకు రైతులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
మట్టపల్లిలో నిత్యారాధనలు
మఠంపల్లి: మట్టపల్లి క్షేత్రంలో ఆదివారం విశేష పూజలు, నిత్యారాధనలు కొనసాగాయి. అనంతరం శ్రీరాజ్యలక్ష్మీ చెంచులక్ష్మీ సమేత శ్రీలక్ష్మీనృసింహస్వామి వారిని వధూవరులుగా అలంకరించి ఎదుర్కోలు మహోత్సవం నిర్వహించారు. ఆ తర్వాత విష్వక్సేనారాధన, పుణ్యాహవచనం, రక్షాబంధనం, మదుఫర్కపూజ, తలంబ్రాలతో అర్చకులు నిత్యకల్యాణాన్ని వైభవంగా నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు విజయ్‌కుమార్, మట్టపల్లిరావు, ఈఓ నవీన్‌కుమార్, అర్చకులు లక్ష్మణాచార్యులు, పద్మనాభాచార్యులు, ఫణిభూషణ మంగాచార్యులు, లక్ష్మీనరసింహమూర్తి, ఆంజనేయాచార్యులు, భక్తులు పాల్గొన్నారు.
నారసింహుడికి
సంప్రదాయ పూజలు
యాదగిరిగుట్ట రూరల్: యాదగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో ఆదివారం సంప్రదాయ పూజలు శాస్త్రోక్తంగా కొనసాగాయి. వేకువజామునే ఆలయాన్ని తెరిచిన అర్చకులు మేల్కొలుపులో భాగంగా స్వయంభూవులకు సుప్రభాత సేవ చేపట్టారు. ఆ తర్వాత స్వామి, అమ్మవార్లకు ఆరాధన, నిజాభిషేకం, అర్చన సేవలు గావించారు. ఇక ఆలయ ముఖ మండపంలో సువర్ణ పుష్పార్చన, అష్టోత్తరం, ప్రాకార మండపాల్లో శ్రీ సుదర్శన నారసింహాహోమం, గజవాహన సేవ, నిత్యకల్యాణం, బ్రహ్మోత్సవం, వేద ఆశీర్వచనం, తదితర కై ంకర్యాలు నిర్వహించారు. సాయంత్రం స్వామి, అమ్మవారి జోడు సేవలను ఆలయ మాడ వీధుల్లో ఊరేగించారు. ఆయా పూజల్లో భక్తులు పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. రాత్రి శయనోత్సవం జరిపించి ఆలయాన్ని ద్వారబంధనం చేశారు.
క్రికెట్ బెట్టింగ్‌ల జోలికి వెళ్లొద్దు : ఎస్పీ
క్రికెట్ బెట్టింగ్‌ల జోలికి వెళ్లొద్దు : ఎస్పీ
Comments
Please login to add a commentAdd a comment