క్రమబద్ధీకరణకు నిరీక్షణ!
మఠంపల్లి: జిల్లాలోని 23 మండల పరిషత్ కార్యాలయాల్లో పనిచేస్తున్న సుమారు 70 మంది కంప్యూటర్ ఆపరేటర్లు తమ సర్వీస్ క్రమబద్ధీకరణకు ఏళ్లుగా నిరీక్షిస్తున్నారు. తమను రెగ్యులరైజ్ చేయాలని కొంతకాలంగా ప్రభుత్వానికి విన్నవిస్తున్నా.. పాలకులు చేస్తామని చెబుతున్నారే తప్ప ఫలితం ఉండడం లేదని ఆపరేటర్లు వాపోతున్నారు.
పదేళ్ల నుంచి విధులు..
జిల్లాలోని 23 మండల పరిషత్ కార్యాలయాల్లో 2015 సంవత్సరం నుంచి ఒక్కో కార్యాలయంలో ముగ్గురు చొప్పున 70 మంది ఆపరేటర్లు పనిచేస్తున్నారు. వీరంతా ప్రారంభంలో రూ.6వేల వేతనంతో విధుల్లో చేరారు. కాగా వీరి వేతనాన్ని మధ్యలో మూడు పర్యాయాలుగా మొదటిసారి రూ.8వేలుగా, తర్వాత రూ.12వేలుగా, రూ.17,500గా పెంచిన రాష్ట్ర ప్రభుత్వం గత సంవత్సరం నేరుగా రూ.22,500లకు పెంచింది. దీంతో తమ సమస్యలు పరిష్కారమవుతాయని ఆపరేటర్లు ఎంతో సంతోషించారు. అయినప్పటికీ వారి సంతోషం ఎంతో కాలం నిలవలేదు. అయితే ఎవరూ ఊహించని రీతిలో ప్రభుత్వం కంప్యూటర్ ఆపరేటర్ల వేతనాలను రూ.22,500 నుంచి రూ.19,500కు తగ్గించింది. ఉద్యోగుల వేతనాలు పెంచాల్సింది పోయి తగ్గించడం పట్ల కంప్యూటర్ ఆపరేటర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అకౌంట్లు సేకరించి..
ఇదిలా ఉంటే కంప్యూటర్ ఆపరేటర్ల వేతనాలను మూడు మాసాల క్రితం గ్రీన్‌చానల్ అనే పద్ధతి ద్వారా నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో వేస్తామని ప్రభుత్వం బ్యాంకు అకౌంట్లు సేకరించింది. కానీ జిల్లా వాప్తంగా ఆపరేటర్లకు టీఎస్‌బీపాస్ ద్వారా ఒకనెల వేతనం ఇచ్చారు. ఇంకా కొన్ని మండలాల్లో ఆపరేటర్లకు పెండింగ్ వేతనాలు అందాల్సి ఉంది. ఏ కార్యాలయంలోనైనా ఉద్యోగులు ప్రతిరోజూ ఉదయం 10గంటలకు వచ్చి సాయంత్రం 5గంటలకు ఇంటికి వెళతారు. కానీ ప్రభుత్వం తమతో ఇందిరమ్మ ఇళ్లు, రేషన్‌కార్డులు, ప్రజాపాలన దరఖాస్తులు, ఓటర్ల జాబితా తదితర సర్వేలు ఆన్‌లైన్ చేయిస్తూ ఒక్కోసారి అర్ధరాత్రి వరకు పనులు చేయించుకుంటోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇన్ని రకాల పనులు చేస్తున్న తమ ఉద్యోగాలను క్రమబద్ధీకరించి తమకు కనీస వేతనం అందించాలని కంప్యూటర్ ఆపరేటర్లు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
ఫ ఎంపీడీఓ ఆఫీసుల్లో పదేళ్లుగా విధులు నిర్వహిస్తున్న కంప్యూటర్ ఆపరేటర్లు
ఫ మధ్యలో వేతనం పెంచి
తగ్గించడంపై ఆవేదన
ఫ పెండింగ్ వేతనాలు కూడా
అందించని ప్రభుత్వం
ఫ జిల్లాలో 70 మంది సిబ్బంది
Comments
Please login to add a commentAdd a comment