సీఎం సభా ఏర్పాట్లు పక్కాగా ఉండాలి
ఉగాది పర్వదినాన సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా హుజూర్‌నగర్‌లో రేషన్ కార్డుదారులకు సన్న బియ్యం పంపిణీ పథకం ప్రారంభం సందర్భంగా నిర్వహించే సభా ఏర్పాట్లు పక్కాగా ఉండాలని మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి ఆదేశించారు. ఆదివారం హుజూర్‌నగర్ పట్టణంలోని ఫణిగిరి గుట్టకు వెళ్లే రోడ్డులో సీఎం సభా ప్రాంగణ ఏర్పాటుకు మంత్రి జిల్లా అధికారులతో కలిసి స్థలాన్ని పరిశీలించారు. అనంతరం మంత్రి క్యాంప్ కార్యాలయంలో సీఎం సభ ఏర్పాట్లపై జిల్లా అధికారులలతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎటువంటి లోటుపాట్లు లేకుండా చూడాలని, వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని సభకు వచ్చే వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా తగిన ఏర్పాట్లు చేయాలన్నారు. రాష్ట్రంలోని రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం పంపిణీకి ఇక్కడి నుంచే శ్రీకారం చుట్టామన్నారు. సమావేశంలో కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్, ఎస్పీ నర్సింహ, అదనపు కలెక్టర్ రాంబాబు, ఇరిగేషన్ సీఈ రమేష్‌బాబు, ఆర్టీసీ ఆర్‌ఎం జానిరెడ్డి, డీఎస్పీ శ్రీధర్‌రెడ్డి, సీఐ చరమందరాజు, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి, యరగాని నాగన్న, లక్ష్మీనారాయణరెడ్డి, తన్నీరు మల్లిఖార్జున్, కోతి సంపత్‌రెడ్డి, శివరాంయాదవ్, ఆదెర్ల శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment