ఆర్టీసీ ఉద్యోగుల డిమాండ్లు నెరవేర్చాలి
భానుపురి: రాష్ట్ర ప్రభుత్వం టీజీఎస్ ఆర్టీసీ ఉద్యోగుల న్యాయబద్ధమైన డిమాండ్లను నెరవేరేలా కృషిచేయాలని తెలంగాణ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి సుంకరి శ్రీనివాస్ కోరారు. ఆదివారం సూర్యాపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్‌రెడ్డికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్‌ఎస్ తరఫున ఆర్టీసీ కార్మికుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలన్నారు. కార్యక్రమంలో నాయకులు జి.ఏకాంబరం బెల్లి నర్సయ్య, జక్కుల వెంకటేశ్వర్లు జి.వెంకన్న ఎ.శ్రీవర్ధన్‌రాజు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment