
నేటి నుంచి ‘పది’ మూల్యాంకనం
సూర్యాపేట టౌన్: పదో తరగతి వార్షిక పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనానికి జిల్లా విద్యా శాఖ యంత్రాంగం సిద్ధమైంది. ఇందుకు జిల్లా కేంద్రంలోని ఏవీఎం పాఠశాలలో అన్ని ఏర్పాట్లు చేశారు. గత ఏడాది నుంచి జిల్లాలో పదో తరగతి పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం జరుగుతోంది. ఈ ఏడాదికి సంబంధించిన మూల్యాంకనం ప్రక్రియం సోమవారం నుంచి ప్రారంభమై 15వ తేదీ వరకు కొనసాగనుంది.
జిల్లాకు 1.5లక్షల జవాబు పత్రాలు!
మూల్యాంకనానికి జిల్లాకు దాదాపు సుమారు 1.5 లక్షలకు పైగా జవాబు పత్రాలు వస్తాయని అధి కారులు భావిస్తున్నారు. విధుల్లో పాల్గొ నేందుకు జిల్లా నుంచి మొత్తం ఏఈలు, సీఈ లు, స్పెషల్ అసిస్టెంట్‌లు కలిపి 600 మంది ఉపాధ్యాయుల్ని నియమించారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పేపర్లు దిద్దనున్నారు. జిల్లాకు వస్తున్న జవాబు పత్రాలు స్ట్రాంగ్ రూంలో భద్రపరుస్తున్నారు. మరోపక్క కోడింగ్ ప్రక్రియ జరుగుతోంది.
ఫ 15వ తేదీ వరకు కొనసాగనున్న ప్రక్రియ
ఫ 600 మంది ఉపాధ్యాయులకు విధులు
ఫ సూర్యాపేటలోని ఏవీఎం స్కూల్‌లో ఏర్పాట్లు
ఉపాధ్యాయులంతా హాజరుకావాలి
పదో తరగతి పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం ఈ ఏడాది జిల్లా కేంద్రంలోని ఏవీఎం పాఠశాలలో జరుగుతుంది. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు చేశాం. ఇప్పటికే జవాబు పత్రాలు స్ట్రాంగ్ రూంలో భద్రపరిచాం. మూల్యాంకనానికి సంబంధించి ఆర్డర్లు వచ్చిన ఉపాధ్యాయులంతా తప్పకుండా విధులకు హాజరు కావాలి.
– అశోక్, డీఈఓ, సూర్యాపేట

నేటి నుంచి ‘పది’ మూల్యాంకనం