
అన్నానగర్: కోట్టంపట్టి సమీపంలో కారులో వెళ్లిన దంపతుల నుంచి రూ.50 లక్షలు చోరీ చేసిన కేసులో ఓ పోలీసు సహా ఐదుగురిని పోలీసులు శనివారం అరెస్టు చేశారు. వివరాలు.. మదురై తెప్పకుళానికి చెందిన షేక్ దావూద్ (55) వస్త్ర వ్యాపారం చేస్తున్నారు. శుక్రవారం తన భార్య యూసుఫ్ సులైకాతో కలిసి రూ.50 లక్షల నగదుతో కారులో బయలుదేరాడు. తిరుచ్చి ట్రావెల్స్ నడుపుతున్న తన బంధువుకు ఈ డబ్బులు ఇచ్చేందుకు వెళ్లినట్టు తెలుస్తోంది. త్రిచునై డివిజన్ కోట్టంపట్టి సమీపంలోకి కారు రాగానే ఇద్దరు వ్యక్తులు పోలీసు యూనిఫాంతో కారు ఆపి వాహనాన్ని తనిఖీ చేశారు.
కారులో డబ్బులు రూ.50 లక్షలు ఉన్నట్లు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. షేక్ దావూద్ మొబైల్ ఫోన్‌ను కూడా లాకున్నారు. కోట్టంపట్టి పోలీసుస్టేషన్‌కు వచ్చి తగిన రసీదులను చూపించి డబ్బును తీసుకెళ్లాలని సూచించి అక్కడి నుంచి పరారయ్యారు. దీంతో బాధితుడు షేక్ దావూద్ ఫిర్యాదు మేరకు జిల్లా ఎస్పీ శివప్రసాద్, డిప్యూటీ ఎస్పీ అర్లియస్ రిపోని ఘటనా స్థలానికి వెళ్లి విచారణ చేపట్టారు. విచారణలో షేక్ దావూద్ కారు డ్రైవర్ అబూబకర్ సిద్ధిఖీ సోదరుడు సద్ధాం హుస్సేన్ (30), ఇతని స్నేహితులు కానిస్టేబుల్ నాగరాజ గోకుల పాండ్యన్ (30), పుదూరుకు చెందిన అసన్ మహ్మద్ (30), పార్థసారథి (42) బాధితుల నుంచి డబ్బులు తస్కరించినట్లు తేలింది. దోపీడీ అనంతరం మదురైలో తలదాచుకున్న నలుగురిని పోలీసులు అరెస్టు చేసి నదదును స్వాధీనం చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment