
వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న స్టాలిన్
సాక్షి, చైన్నె : లోక్‌సభ ఎన్నికల్లో పుదుచ్చేరితో పాటు రాష్ట్రంలోని 40 స్థానాల్లో గెలుపే లక్ష్యంగా.. కార్యక్ర మాలపై దృష్టి పెట్టాలని నియోజకవర్గ పర్యవేక్షకులకు డీఎంకే అధ్యక్షుడు, సీఎం స్టాలిన్ పిలుపునిచ్చారు. లోక్‌సభ ఎన్నికల్లో క్లీన్ స్వీపే లక్ష్యంగా స్టాలిన్ వ్యూహాలకు పదును పెట్టిన విషయం తెలిసిందే. ఇందుకోసం రాష్ట్రంలోని 234 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇన్‌చార్జ్‌లు, పర్యవేక్షకులను నియమించి కార్యక్రమాలను విస్తృతం చేయాలని నిర్ణయించారు.
వీరితో శనివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమయ్యా రు. నియోజకవర్గాల వారీగా పార్టీ పరిస్థితి. సభ్యత్వ నమోదు, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా కార్యక్రమాలు చేపట్టాలని వివరించారు. పుదుచ్చేరితో పాటు రాష్ట్రంలోని 40 స్థానాల్ని కై వసం చేసుకునే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని ఆయన ఆదేశించారు. అలాగే ప్రభుత్వ పథకాలు ప్రతి ఇంటి ముంగిటకు చేరే విధంగా ప్రత్యేక కార్యక్రమాలను విస్తృతం చేయాలని సూచించారు.