సాక్షి, చైన్నె : ప్రేమోన్మాదానికి మరో అబల సంధ్య బలైంది. ఆమెను అతి కిరాతకంగా ప్రేమోన్మాది నరికి చంపేశాడు. సోమవారం సాయంత్రం ఈ ఘటన తిరునల్వేలిలో చోటు చేసుకుంది. వివరాలు.. తిరునల్వేలి జిల్లా తిరుపతి కరసల్‌ప్రాంతానికి చెందిన మారి ముత్తు మూడో కుమార్తె సంధ్య. ఈమె తిరునల్వేలి టౌన్ కీళ రథం వీధిలోని ఓ ఫ్యాన్సీ షోరూమ్‌లో పనిచేస్తోంది. మధ్యాహ్నం అమ్మన్ వీధిలోని గోడౌన్‌కు కొన్నిఫ్యాన్సీ సామాన్లు తెచ్చేందుకు వెళ్లిన సంధ్య ఎంతకు రాలేదు. దీంతో ఆ షోరూమ్‌లో ఉన్న ఇతర సిబ్బంది గోడౌన్‌కు వెళ్లి చూశారు.
అక్కడ ఆమె రక్తపు ముడుగులో పడి ఉండటంతో ఆందోళనతో పోలీసులకు సమాచారం అందించారు. అక్కడకు చేరుకున్న పోలీసులు పరీక్షించగా ఆమె మృతి చెందినట్టు గుర్తించారు. ఈ హత్యకు ప్రేమ వ్యవహారం కారణంగా ప్రాథమిక విచారణలో తేలింది. సంధ్యను తరచూ ఓ యువకుడు వెంబడించే వాడని, ప్రేమ పేరిట వేధించే వాడని విచారణలో తేలింది.
కొంతకాలం వీరు చెట్టాపట్టలు వేసుకుని తిరిగి తర్వాత కొద్దిరోజులకు ఆమె దూరం పెట్టడంతో అతడు ఈ దారుణానికి పాల్పడినట్టు వెలుగు చూసింది. దీంతో ఆ ప్రేమోన్మాది ఎవరో అనే విషయంపై పోలీసులు విచారణ చేస్తున్నారు. సంధ్య మృత దేహాన్ని పాళయంకోట్టై ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఇటీవల కాలంగా ప్రేమోన్మాదుల చేతిలో యువతులు బలి అవుతున్న సంఘటనలు రాష్ట్రంలో పెరుగుతోండడం ఆందోళనకరంగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment