నాలుకను రెండుగా చీల్చి పచ్చబొట్టు
అన్నానగర్: తిరుచ్చి చింతామణి వెనిస్ వీధికి చెందిన హరిహరన్ (25). ఇతను తిరువెరుంబూర్ సమీపంలోని కూతప్పార్ ప్రాంతానికి చెందిన జయరామన్ (24)తో కలిసి తిరుచ్చి బస్టాండ్ సమీపంలోని చింతామణి బజార్ లో శ్రీఏలియన్ ఎమో టాట్ఙూ పేరుతో షాపు నిర్వహిస్తున్నాడు. ఇక్కడ హరిహరన్ కస్టమర్ల శరీరంపై పచ్చబొట్లు పొడిపించుకోవడంతో పాటు వివిధ పనులు చేసేవాడు.
ఈలోగా ఏలియన్ లుక్‌ని క్రియేట్ చేయడం గురించి తెలుసుకుని గత 7 నెలలుగా ముంబై వెళ్లాడు. అక్కడ రూ.6 లక్షలు వెచ్చించి కళ్లలోని తెల్లని రంగును నీలం రంగులోకి మార్చుకున్నాడు. అలాగే శస్త్ర చికిత్స ద్వారా నాలుకను రెండు ముక్కలు చేసి టాటూ వేయించుకున్నాడు. అప్పటి నుంచి పచ్చబొట్టు పేరుతో సూదితో కళ్లలోని కళ్ల రంగు మార్చి, నాలుకను రెండుగా మార్చి, రంగులు వేస్తూ ఏలియన్ లుక్ క్రియేట్ చేస్తున్నాడు. అతను సోషల్ మీడియాలో ప్రచారం చేశాడు.
అలాగే గత 9వ తేదీన తన దుకాణంలో సరైన శిక్షణ, అనుమతి లేకుండానే తన స్నేహితుడికి ఆపరేషన్ చేసి నాలుకను రెండుగా చీల్చి టాటూ రంగు వేశాడు. దాన్ని వీడియో తీసి తన సోషల్ మీడియా పేజీలో పోస్ట్ చేశాడు.ఇది చూసిన సామాజిక కార్యకర్తలు విపరీత పోకడాలకు పోతున్న హరిహరన్, జయరామన్‌పై ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఇద్దరినీ మంగళవారం అరెస్ట్ చేశారు. అలాగే వారి షాపును సీజ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment