గిరివలయం సమీపంలో నలుగురి ఆత్మహత్య
మృతులంతా ఒకే కుటుంబ సభ్యులు
పోలీసుల ముమ్మర విచారణ
వేలూరు: తిరువణ్ణామలై గిరివలయం రోడ్డులో చైన్నె భక్తులు నలుగురు ఓ ప్రైవేటు గెస్ట్ హౌస్‌లో ఆత్మహత్య చేసుకున్న ఘటన పలువురిని కలిసి వేసింది. వివరాలు.. చైన్నె వాసర్ పాడికి చెందిన మహా కాలవాసుడు(45), ఇతని భార్య రుక్మణిప్రియ(40) కుమార్తె జలందరి(17), కుమారుడు ముకుంద్ ఆకాష్ కే కుమార్(15) తిరువణ్ణామలైలోని స్వామి వారి దర్శనార్ధం వచ్చారు.
వీరందరూ కలిసి తిరువణ్ణామలైలోని గిరివలయం రోడ్డులో ఉన్న సూర్యలింగం ఆలయం వద్ద ఉన్న ప్రైవేటు గెస్ట్ హౌస్‌లో గదులను గత రెండు రోజుల క్రితం తీసుకున్నారు. శనివారం ఉదయం 10 గంటల వరకు గది నుంచి బయటకు రాకపోవడంతో అక్కడ పనిచేస్తున్న కార్మికులు పరిశీలించారు. ఆ సమయంలో గదులకు తాళం వేసి ఉండడంతో అనుమానంతో తిరువణ్ణామలై పోలీసులకు సమాచారం అందజేశారు.
పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ఇంటికి వెనుక భాగంలో తాళాలు వేసి ఉండడంతో పోలీసులు తలుపులు బద్దలుకొట్టి లోనికి వెళ్లి పరిశీలించారు. ఆ సమయంలో ఒక గదిలో నలుగురు మృతి చెంది ఉండటాన్ని గమనించి వెంటనే తిరువణ్ణామలై ప్రభుత్వాసుపత్రికి పోస్టు మార్టం నిమిత్తం తరలించి గదిలో గాలించారు. ఆ సమయంలో ఆ గదిలో ఒక డైరీ లభించింది. అందులో వారు తాము భగవంతుని వద్దకు వెళ్తున్నామని రాసి ఉండటాన్ని గమనించారు. ప్రాథమిక విచారణలో వీరందరూ విషం తాగి ఒకే గదిలో ఆత్మహత్య చేసుకున్నట్లు నిర్ధారణ అయింది. స్థానిక పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment