సాక్షి,హైదరాబాద్: రాజధాని హైదరాబాద్ నగరంలో భారీ ఆర్థిక నేరం వెలుగులోకి వచ్చింది. మాదాపూర్ ప్రాంతంలో చిట్టీల పేరుతో రూ.200 కోట్లు ప్రజల వద్ద నుంచి వసూలు చేసి బోర్డు తిప్పేశారు. సమతా మూర్తి చిట్ ఫండ్ ఫండ్ కంపెనీ పేరుతో ఈ భారీ మోసానికి పాల్పడ్డారు.
చిట్‌ఫండ్ కంపెనీ నిర్వాహకుల చేతిలో మోసానికి గురైన వందలాది మంది బాధితులు రెండు నెలల క్రితమే మాదాపూర్‌లో ఫిర్యాదు చేసినా పోలీసులు ఎఫ్‌ఐఆర్ చేయలేదని తెలుస్తోంది. దీంతో బాధితులు సైబరాబాద్ పోలీసు కమిషనర్‌ను ఆశ్రయించారు. సీపీ ఆదేశాలతో కదిలిన మాదాపూర్ పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు.
చిట్‌ఫండ్ కంపెనీతో సంబంధమున్న శ్రీనివాస్, రాకేష్, గణేష్ జ్యోతి అనే వ్యక్తులపై కేసులు నమోదు చేశారు. శ్రీనివాస్, రాకేష్‌ను ఇప్పటికే అదుపులోకి తీసుకున్న పోలీసులు మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు. గణేష్, జ్యోతిలు పోలీసులకు చిక్కకుండా పరారీలో ఉన్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment